సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Charan: వారికి నటించడం రాదు..

ABN, Publish Date - May 21 , 2026 | 04:25 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది(Peddi)పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన (Buchhibabu Sana) దర్శకత్వం వహిస్తున్నారు.

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది(Peddi)పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన (Buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ మిశ్రమ స్పందనను అందుకొన్న విషయం తెల్సిందే. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్, బుచ్చిబాబు ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.


పెద్ది సినిమా ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు చరణ్ మాట్లాడుతూ 'పెద్ది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ కథలో ఉన్న ఎమోషన్స్, పాత్రలో ఉన్న డెప్త్ నాకు బాగా నచ్చాయి. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యాన్స్ నన్ను కొత్తగా చూస్తారు. పెద్ది సినిమా పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇప్పటివరకు నేను చేయని పాత్ర ఇది. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే భావోద్వేగాలు, పాత్రల నడుమ ఉండే రిలేషన్‌షిప్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవుతాయి' అని చెప్పుకొచ్చాడు.


ఇక రియల్ రెజ్లర్స్ తో నటించడం ఎలా ఉంది.. ? చాలా కష్టంగా అనిపించిందా.. ? అన్న ప్రశ్నకు చరణ్ మాట్లాడుతూ.. ' ఇసుకలో, ఎండలో షూటింగ్ కష్టంగా అనిపించినా.. నేను చాలా ఇష్టంగా చేశాను. అందుకే నాకు నేను షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. మీరు నాకు రియల్ కుస్తీ యోధులను తీసుకొస్తారని తెలియదు. వారు బయట ఎలా ఆట ఆడతారో అలాగే ఆడేవారు. ఆ తరువాత నాకు వచ్చి సారీ చెప్పేవారు. వారితో ఆడడం వలన చేయి బాగా నొప్పి వచ్చింది. మా పాపను కూడా ఎత్తుకోలేకపోయాను. ఆ రెజ్లర్లలో నిజమైన స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటుంది.. వారికి నటించడం రాదు' అని చెప్పాడు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - May 21 , 2026 | 04:40 PM