సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్దిపై నెగిటివ్ ట్రోలింగ్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే

ABN, Publish Date - May 30 , 2026 | 09:20 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 4 న రిలీజ్ కు సిద్దమవుతుంది.

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 4 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మిక్స్డ్ ను అందుకుంది. మొదట పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ అయ్యి సిక్సర్ అందుకుంది. ఆ తరువాత రిలీజ్ అయిన చికిరి సాంగ్ కి కూడా మంచి స్పందన లభించింది.


ఇక ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో మిక్స్డ్ టాక్ మొదలయ్యింది. కొంతమంది నచ్చలేదు అని, ఇంకొందరు అసలు అర్ధం కాలేదని పెదవి విరిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెద్దిపై వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ పై రామ్ చరణ్ స్పందించాడు. ఇలాంటి ట్రోల్స్ ని తాను పట్టించుకోనని తెలిపాడు. అంతేకాకుండా తాము తీసే సినిమాలు అందరికీ నచ్చాలని లేదని.. కాకపోతే తమ కష్టాన్ని గుర్తిస్తే చాలని తెలిపాడు.


' ఈ ట్రోలింగ్ పై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఈ ట్రోల్స్ ని నేను ఆపలేను. ఎందుకంటే అది నా కంట్రోల్ లో లేదు. అలాంటి వాటి గురించి నేను మాట్లాడను. ఒక్కటి మాత్రం చెప్తాను. మేము తీసే సినిమాలు అందరికీ నచ్చుతాయని నేను చెప్పను.. కానీ, ఆ సినిమాలో మేము పడే కష్టాన్ని వారు గుర్తిస్తే చాలు' అని తెలిపాడు. ఇండస్ట్రీ మొత్తం పెద్దిపై చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.

Updated Date - May 30 , 2026 | 09:39 PM