రామ్ చరణ్ 'పెద్ది' పహిల్వాన్.. గ్లింప్స్ అదిరింది! నెక్ట్స్ లెవల్ అంతే
ABN, Publish Date - Mar 27 , 2026 | 10:26 AM
రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం ఆయన నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం ఆయన నటిస్తున్న పెద్ది (Peddi ) చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పెద్ది పహిల్వాన్ (Peddi Pehelwan) అంటూ ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ విడుదల చేసి రామ్ చరణ్ సన్నివేశాలను రివీల్ చేశారు. 45 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ గ్లింప్స్ చూసే వారికి ఫుల్ ఇంఫాక్ట్ ఇచ్చేలా, కట్టి పడేసేలా ఉంది.
రామ్ చరణ్ కుస్తీ మైదానంలోకి దిగడం బ్యాగ్రౌండ్‌లో 'కుస్తీ అంటే బంతితో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట.. ఇప్పుడు చెప్పు ఉంటావా పోతావా' అంటూ గంభీరమైన వాయిస్ ఓవర్ వస్తుండగా చరణ్ గ్రౌండ్‌లో ప్రత్యర్థితో తలపడడం చూపించారు. ఈ క్రమంలో 8 ప్యాక్ సైతం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండగా సినిమా కోసం బాడీని బాగానే శ్రమ పెట్టినట్టు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చివర్లో శ్రీకాకుళం యాసలో 'చూడు అమ్మి.. ఆటే నా పొగరు' అంటూ చరణ్ నుంచి వచ్చే డైలాగులు సైతం పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.
ఇందులో చరణ్ విజువల్స్ చూసి ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ అంతా వావ్ అనేలా ఉన్నాయి. ఏంటి మనం చూస్తున్నది నిజమేనా అని చాలా మంది షాక్ అవుతున్నారు. అంతలా చరణ్ ఈ సినిమా కోసం మేకోవర్ అయినట్లు కనిపిస్తోంది. ఇంకా గదతో చేసే విన్యాసాలైతే అంతకుమించి అనే స్థాయిలో ఉన్నాయి. చూస్తుంటే దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) ఏదో గట్టిగానే ఫ్లాన్ చేసినట్లుగా ఉంది.