ఒకే కారులో.. రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రయాణం! ఆ.. ల్యాండ్ క్రూయిజర్ ఎవరిదో తెలుసా?
ABN, Publish Date - Aug 10 , 2026 | 10:42 AM
రామ్ చరణ్, అల్లు అర్జున్ వేర్వేరు సందర్భాల్లో ఒకే టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లో ప్రయాణించారు. ఏపీ 40 ఎల్ 1 నంబర్ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) లు ఇటీవల ఏపీ రాష్ట్ర పర్యటనలో భాగంగా వినియోగించిన కారుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. మంగళగిరి (Mangalagiri) స్టేడియంలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఏపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన రామ్ చరణ్ ప్రయాణించిన ఏపీ 40 ఎల్ 1 ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కారులోనే ఆదివారం అల్లు అర్జున్ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్‌లోని ఏఏఏ స్క్రీన్ల ప్రారంభోత్సవానికి వచ్చారు.
దీంతో ఆ కారు గురించి ఇప్పుడు అనేకమంది ఆరా తీస్తున్నారు. ఈ కారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితు డైన భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ghanta Srinivasa Rao) ది కావడం గమనార్హం. తరుచూ మెగా కుటుంబ సభ్యులు విశాఖ వచ్చినప్పుడల్లా గంటానే స్వయంగా వారికి ఆత్మీయ ఏర్పాట్లు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మంగళగిరి పర్యటనకూ ఆయన ఈ కారును పంపారు. తాజాగా అల్లు అర్జున్ సైతం ఆ కారులోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా అభిమానులు ఫ్యాన్ వార్లు పక్కన పెట్టాలని ట్యాగ్ చేస్తూ ఇద్దరు హీరోలు ప్రయాణించిన కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి