సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జక్కన్న నెక్స్ట్ టార్గెట్ బన్నీనా!?

ABN, Publish Date - Jul 03 , 2026 | 02:52 PM

టాలీవుడ్‌లో మరో హిస్టారికల్ కాంబోకు రంగం సిద్ధమవుతోందా? ఎవరూ ఊహించని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లు.. వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చేతులు కలపబోతున్నారా? అంటే.. అవుననే ఆన్సర్ వస్తోంది ఫిల్మ్ నగర్ నుంచి. నేషనల్ కాదు.. ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో విధ్వంసం సృష్టించేందుకు వీరు రెడీ అవుతున్నారు.

Rajamouli and Allu Arjun

ఎస్.ఎస్. రాజమౌళి.. ఈ పేరు వింటే చాలు ప్రపంచవ్యాప్తంగా తిరగ రాసిన సినిమాలు గుర్తొస్తాయి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను పాన్-వరల్డ్ ఐకాన్స్‌గా నిలబెట్టిన ఘనత జక్కన్నదే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'వారణాసి'ని వరల్డ్ క్లాస్ జంగిల్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు రాజమౌళి. అయితే.. ఈ విజువల్ వండర్ కంప్లీట్ అయ్యాక ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారనే చర్చ.. ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీని హీటెక్కిస్తోంది.


రాజమౌళి డైరెక్షన్‌లో ఇప్పటివరకు నటించని టాలీవుడ్ టాప్ స్టార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! అందువల్ల మహేశ్ బాబు సినిమా తర్వాత జక్కన్న నెక్స్ట్ టార్గెట్ బన్నీనే అనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'పుష్ప'తో అల్లు అర్జున్ రేంజ్ రీజనల్ బోర్డర్స్ దాటి గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది. సౌత్-నార్త్ అనే తేడా లేకుండా వరల్డ్ వైడ్‌గా బన్నీ క్రియేట్ చేసిన మేనియా మామూలుది కాదు. పైగా.. బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న ఫస్ట్ తెలుగు హీరోగానూ బన్నీ హిస్టరీ క్రియేట్ చేశాడు. బన్నీ డెడికేషన్, యాక్టింగ్, డ్యాన్స్.. రాజమౌళి మార్క్ 'లార్జర్ దాన్ లైఫ్' క్యారెక్టర్లకు పర్ఫెక్ట్ ఫిట్ అని ట్రేడ్ వర్గాలు కూడా గట్టిగా లెక్కలేస్తున్నాయి.

ఈ క్రేజీ కాంబో ఇన్నేళ్లు సెట్ కాకపోవడానికి కారణం.. 'మగధీర' టైమ్‌లో అల్లు అరవింద్‌కు, రాజమౌళికి మధ్య వచ్చిన క్రియేటివ్ క్లాషెస్ అనే ప్రచారం ఉంది. ఆ గ్యాప్ వల్లే ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లూ హోల్డ్‌లో పడిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించేవి. కానీ.. ఆ మధ్య బన్నీ హార్డ్ వర్క్‌ను, అతను నేషనల్ అవార్డ్ విన్నర్ గా నిలిచినప్పుడు రాజమౌళి ఓపెన్‌గా అభినందించడంతో.. ఇద్దరి మధ్య రిలేషన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా బలపడిందని క్లియర్ గా అర్థమవుతోంది. దీంతో బన్నీతోనే జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ క్రేజీ లైనప్‌తో, రాజమౌళి మహేశ్ ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. 'వారణాసి' కంప్లీట్ అయ్యాక ఈ ఇద్దరి కాంబో సెట్ అయితే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కొత్త విధ్వంసం చూడడం ఖాయం. మరి ఈ హిస్టారికల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?

National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!

‘రావు బహదూర్’.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు

Updated Date - Jul 03 , 2026 | 02:52 PM