Varanasi: జక్కన్న మరోసారి నవంబర్ సెంటిమెంట్.. మహేష్ ఫ్యాన్స్‌కు భారీ ట్రీట్?
ABN, Publish Date - Oct 28 , 2026 | 11:12 AM
మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ విడుదల తేదీ సమీపుస్తున్న కొద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏది అంటే.. అందరి నోటా వినిపించే ఒకే ఒక్క పేరు వారణాసి (Varanaasi). గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బియాండ్ ది ఎడ్జ్ అనేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం తెలుగు ఆడియన్సే కాదు, యావత్ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ప్రీ గ్లింప్స్, పోస్టర్స్ ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో చూశాం. అప్పటినుంచి ఇప్పటిదాకా అఫీషియల్ అప్డేట్ ఏదీ రాకపోయినా, పలు అంతర్జాతీయ ఈవెంట్లలో జక్కన్న పంచుకున్న న్యూసే సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తుంది.
గతంలో వచ్చిన ప్రీ గ్లింప్స్‌లో చూపించిన ప్రతి ఫ్రేమ్ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తించింది. అడ్వెంచరస్ ఎలిమెంట్స్‌తో పాటు కథలో తండ్రీ కొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్, అలాగే లీడ్ పెయిర్ మధ్య వచ్చే బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ సినిమాకు ప్రధాన బలంగా ఉండబోతున్నాయని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేశారు. కేవలం విజువల్స్ మాత్రమే కాదు, ప్రేక్షకుడి గుండెను తాకే బలమైన డ్రామాను జోడించడంలో జక్కన్న సిద్ధహస్తుడు. ఈసారి కూడా మహేష్ బాబు నుంచి ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. నవంబర్ సెంటిమెంట్‌ను జక్కన్న మరోసారి రిపీట్ చేయబోతున్నారా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. గతేడాది నవంబర్‌లో వరుస ట్రీట్లతో అభిమానులను ఖుషీ చేసిన టీమ్, ఈ నవంబర్‌లో అంతకుమించిన సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు టాక్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరిగి దాదాపు చివరి దశకు చేరుకుంది. దాంతో గతంలో వచ్చినట్లుగా యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోలా కాకుండా, ఈసారి ఏకంగా సినిమా స్కేల్‌ను, ఒరిజినల్ ఫుటేజ్‌ను పరిచయం చేసే సాలిడ్ టీజర్ లేదా మేకింగ్ గ్లింప్స్ రానుందనే ప్రచారం ఊపందుకుంది.
బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి విజువల్ వండర్స్‌ను తెరకెక్కించిన అపార అనుభవం వారణాసి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ వర్క్‌కు ఎంతగానో ఉపయోగపడిందని రాజమౌళి ఇప్పటికే షేర్ చేసుకున్నారు. కంటెంట్ పరంగా, విజువల్ గ్రాండియర్ పరంగా, క్రేజ్ పరంగా కూడా ట్రిపుల్ ఆర్ కంటే వారణాసి ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండబోతోందని రాజమౌళి తేల్చి చెప్పారు. ఈ భారీ కాన్వాస్‌ను మోయడానికి నటీనటుల ఎంపిక కూడా అంతే పకడ్బందీగా జరిగింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్న సంగీతం, కార్తికేయ, కె.ఎల్. నారాయణ నిర్మాణ విలువల కలయికలో ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. మరి ఈ నవంబర్‌లో జక్కన్న ఇవ్వబోయే ఆ బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ఎలా ఉండబోతోంది.. మహేష్ బాబు సరికొత్త అవతారంతో ఆడియన్స్‌ను ఏ విధంగా కట్టిపడేయబోతున్నారు..అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.