రాజమ్మ.. ఇడిచి పోయిందిరో! బ్యాండ్‌మేళం.. పాట అదిరిపోయిందిరో
ABN, Publish Date - Mar 06 , 2026 | 12:02 PM
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా రూపొందిన నూతన చిత్రం ‘బ్యాండ్ మేళం’ నుంచి ఓ హుషారైన పాట రిలీజ్ అయింది.
హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) జంటగా రూపొందిన నూతన చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band Melam). కోన వెంకట్ (Kona Venkat) నిర్మాణంలో సతీష్ జవ్వాజి (Sathish Javvaji) దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ టీజర్, గ్లింప్స్, పాటలు ఆకట్టుకోగా తాజాగా రాజమ్మ.. ఇడిచి పోయిందిరో.. రాజమ్మ పొడిచి పోయిందిరో అంటూ తెలంగాణ యాసలో సాగే పాటను విడుదల చేశారు.
ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) సంగీతంలో రామ్ మిర్యాల ఆలపించారు. అప్పటివరకు ప్రేమించిన మరదలు వదిలేసి పోవడాన్ని జీర్జించుకోలేని బావ పాడుకునే పాటగా ఈ గీతం ఆద్యంతం అర్థవంతమైన లిరిక్స్‌తో సాగింది. విజువల్స్, డ్యాన్స్ స్టెప్స్ సైతం ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. అంతేగాక పాట చివరలో మంచి సందేశం కూడా ఇచ్చారు.
ఇదిలాఉంటే ఇప్పటికే ఈ సినిమాను మార్చి 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించిన డేట్ కన్నా వారం ముందుగానే ఉగాదికి మార్చి 19న థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో తమ బ్యాండ్‌మేళం సినిమాను శ్రీ రామనవమికి మార్చి 26న ప్రేక్షకుల ఎదుటకు తీసుకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.