సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’లో ఐదు ట్విస్టులు.. ప్రతి 25 నిమిషాలకు ఓ బాంబ్!

ABN, Publish Date - Sep 09 , 2026 | 07:43 PM

రాజ్ తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న 'టార్టాయిస్' సినిమా నుంచి 'నీ పరిచయం..' పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా "టార్టాయిస్". అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా నుంచి 'నీ పరిచయం..' పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. 

రాజ్ తరుణ్ మాట్లాడుతూ  'ఒక యూనిక్ థ్రిల్లర్ ఇది. థియేటర్స్ లో మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో మంచి మెలోడీ సందర్భం వచ్చినప్పుడు అనూప్ గారు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటను అందంగా పాడిన చిన్మయి గారికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్.త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అందరికి తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాం' అన్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ  'నీ పరిచయం సాంగ్ మా మూవీకి పిల్లర్ లాంటిది. ఎమోషనల్ గా సాగే ఈ పాట మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటను ఇంత బాగా వచ్చేలా ఉంటుంది. ఈ పాటలో రాజ్ తరుణ్, అమృత పర్ఫార్మెన్స్ ఆకర్షణగా నిలుస్తుంది  మా చిత్రాన్ని బడ్జెట్ లో చెప్పిన డేట్స్ లో ఎంతో క్లారిటీగా మా డైరెక్టర్ రిత్విక్ గారు చేశారు. త్వరలోనే మా మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం. అన్నారు.

డైరెక్టర్ రిత్విక్ కుమార్ మాట్లాడుతూ 'ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉన్న థ్రిల్లర్ సినిమాలో లవ్ ఎలిమెంట్ తీసుకొచ్చి దాన్ని టర్న్ చేస్తూ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ చేశారు రాజ్ తరుణ్. ఇదే ఈ సినిమాకు అతి పెద్ద ఫ్లస్ పాయింట్. ఈ జానర్ లో చూస్తే రాజ్ తరుణ్ గారికి ఈ సినిమా తొలి పరిచయం. హీరోయిన్ అమృతకు తొలి పరిచయం. ఈ సినిమాలో 80 సీన్స్ ఉంటే 70 సీన్స్ లో శ్రీనివాస్ అవసరాల ఉంటారు. ఆయనది అంత ఫుల్ లెంగ్త్ రోల్. సినిమా వేరే లెవెల్లో వచ్చింది. పాట ఎంత బాగుందో చూశారు కదా సినిమా అంతకు మించి ఉంటుంది. 'ఊపిరి అందని నాకు నువ్వే చిరుగాలి..' వంటి అందమైన లైన్స్ తో చంద్రబోస్ గారు ఈ పాటను రాశారు. ఈ పాట హీరోయిన్ క్యారెక్టర్ ను ప్రతిబింబిస్తుంది. మూడు రోజుల క్రితం ఈ సినిమా చూసి నాకు హగ్ ఇచ్చి హిట్ కొడుతున్నామని నిర్మాతలు  అన్నారు. అయితే హౌస్ ఫుల్ బోర్డ్స్ రెడీ చేయండి సార్ అని చెప్పాను. బొమ్మరిల్లు, మజిలీ లాంటి చిత్రాలను థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుందో మా టార్టాయిస్ సినిమా అలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. ఈ కథలో ఐదు ట్విస్టులు ఉంటాయి. ప్రతి 25 నిమిషాలకు ఒక బాంబ్ లా ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ ఐదు ట్విస్ట్ లు ఎవరూ కనుక్కోలేరు. అందరూ ఫుల్ ఎగ్జైట్ అవుతారు. ఇది హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్, నెక్ట్స్ హీరో క్యారెక్టర్ సాంగ్ రిలీజ్ చేస్తాం. మా సినిమాలో మూడు డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. మూడు పాటలు ఎవరెస్ట్ లా ఉంటాయని అనుకోవచ్చు. అన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 07:44 PM