Samantha: బిడ్డ రాక కోసం ముందస్తు ఏర్పాట్లు.. సామ్ పోస్ట్ వైరల్..
ABN, Publish Date - Nov 02 , 2026 | 02:53 PM
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు తమ జీవితంలోకి రాబోతున్న మరో మధురమైన అనుభూతి కోసం ఎదురుచూస్తున్నారు.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు తమ జీవితంలోకి రాబోతున్న మరో మధురమైన అనుభూతి కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న ఈ జంట.. తమ బిడ్డ రాకకు అవసరమైన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సమంత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో అభిమానుల మనసులు దోచుకుంది. అందులో రాజ్ నిడిమోరు తండ్రి బాధ్యతలను ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్లు కనిపించడం విశేషం. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రుల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే ఆ మధుర క్షణాల కోసం ఎదురుచూస్తున్న రాజ్, ఇప్పటికే తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు సమంత షేర్ చేసిన ఫోటో చూస్తే అర్థమవుతోంది. బేబీ మానిటర్ స్టాండ్‌ను స్వయంగా అమర్చుతూ, బిడ్డకు సంబంధించిన ఏర్పాట్లలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న రాజ్‌ను ఈ ఫోటోలో చూడొచ్చు. ఆ ఫోటోను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఈ ఫోటోలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేవు. కానీ రాబోయే బిడ్డ కోసం ఓ తండ్రి చూపిస్తున్న చిన్నపాటి శ్రద్ధ, బాధ్యత అందులో కనిపిస్తున్నాయి. సమంత కూడా తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె తన వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.