AH: అమ్మాయి.. అదృశ్యం.. అనుమానం.. ‘అ’వచ్చేది అప్పుడే
ABN, Publish Date - Oct 10 , 2026 | 01:25 PM
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ'. ఇటీవల విడుదల చేసిన ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది.
రాహుల్ విజయ్ (Rahul Vijay), ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’. ఇటీవల విడుదల చేసిన ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి 'ఇదేనా ఇదేనా' అనే లిరికల్ వీడియో సాంగ్ ఇటీవల విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమాకూర్చిన ఈ పాటను షణ్ముఖ భరద్వాజ్ ఆలపించారు.
దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ ''అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం... అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంది. మిస్టిరీయస్ ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. పాటలతో పాటు ఆర్‌ఆర్ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రాహుల్ విజయ్‌ను ఓ సీన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటుంది' అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ '' ఈ పాటకు సంగీతం, సాహిత్యం, పిక్చరైజేషన్ అన్ని పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. సినిమా తీయడానికి డబ్బు ఉంటే సరిపోదు. సినిమాపై ప్యాషన్, ఎమోషన్ ఉండాలి. అలాంటి నిర్మాతలు తీసిన సినిమా ఇది. శ్రీచరణ్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్. ఈ పాటలతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ''ఈ సినిమా నా కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్. రాహుల్ విజయ్, అర్చన పర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. దర్శకుడు సాయి చూడటానికి సున్నితంగా ఉంటాడు కానీ ఈయన చేసిన క్రైమ్ థ్రిల్లర్ చూస్తే అందరూ షాక్ అవుతారు. అందరికి 'ఇదేనా ఇదేనా' పాట నచ్చుతుందని నమ్ముతున్నాను' అన్నారు.