Raghu Kunche- Devagudi: 'ఫ్యామిలీమ్యాన్'లో మనోజ్ బాజ్‌పాయ్‌లాగా చేయాలనుంది
ABN, Publish Date - Jan 27 , 2026 | 07:30 PM
'యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను
'యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను' అని రఘు కుంచె అన్నారు. బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'దేవగుడి'. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు రఘు కుంచె సినిమా విశేషాలను పంచుకున్నారు.
రఘుకుంచె మాట్లాడుతూ 'స్నేహం, ప్రేమ, పగ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే సినిమా ఇది. ఇందులో దేవగుడి వీరారెడ్డి పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్ ఫుల్ వ్యక్తి. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఎక్కడైతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని దర్శకుడు స్క్రిప్ట్ రాశారో అక్కడే షూటింగ్ చేశాం. వీరారెడ్డి పాత్రలో నటించడాన్ని రోజూ ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది. యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను. మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసినట్లు అలాంటి క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నా' అన్నారు.
బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 'దృశ్యకావ్యం' సినిమా తర్వాత నేను చేసిన సినిమా ఇది. నేను దర్శకుడిగా మారడానికి శ్రీకాంత్ గారు ఇచ్చిన ప్రోద్బలం కారణం. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సార్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్ తో 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఉంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నసినిమా అయినా అది కొంత వరకే చూపించాం. మెయిన్ గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. దేవగుడి వీరారెడ్డి పాత్రలో రఘు కుంచె గారు నటించారు. ఆయన ఆ ప్రాంతంలో మంచి పేరున్న వ్యక్తి. ఆయనకు ఇద్దరు పిల్లలు. వీరిద్దరికి వాళ్ల ఇంటి డ్రైవర్ కొడుకుకు మంచి స్నేహం ఉంటుంది. ఆ ముగ్గురు స్నేహితులు ఎందుకు విడిపోవాల్సివచ్చింది అనేది ఆకట్టుకునే భావోద్వేగాలతో సాగుతుంది. మదీన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు' అన్నారు.