సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏంటీ.. రాఘవ లారెన్స్ కి ఇంత పెద్ద కూతురు ఉందా..

ABN, Publish Date - Jun 05 , 2026 | 08:56 PM

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ కి, సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Raghava Lawrence

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ కి, సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల కంటే ఎక్కువగా లారెన్స్ చేసే సేవా కార్యక్రమాలకే ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సహాయం అన్నవారికి అండగా నిలబడతాడు. ఇక ప్రస్తుతం లారెన్స్ కాంచన 4 , బెంజ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.


గత కొన్నిరోజులుగా లారెన్స్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. లారెన్స్ కుమార్తె రాఘవి లారెన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందని టాక్. అసలు లారెన్స్ కి ఒక కూతురు ఉందన్న విషయమే చాలామందికి తెలియదు. అలాంటింది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది అంటే షాక్ అవుతున్నారు. అయితే లారెన్స్ కుమార్తె రాఘవి తండ్రి పోలికలనే పుణికిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఎంతో కళగా ఉన్న రాఘవి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది అంటే పొరపాటే.. అమ్మడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని అంటున్నారు.


ఒక మంచి కథతో రాఘవి ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్. అయితే లారెన్స్ సన్నిహితులు మాత్రం ఇది అబద్దమని చెప్పుకొస్తున్నారు. రాఘవి ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలు అన్ని ఫేక్ అని అంటున్నారు. రాఘవికి ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని, ఆమె కేవలం తన ఉన్నత చదువులపైనే పూర్తిగా దృష్టి పెట్టోందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా అసలు లారెన్స్ కి ఇంతపెద్ద కూతురు ఉంది అంటేనే నమ్మలేకపోతున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jun 05 , 2026 | 09:05 PM