సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సందీప్ రెడ్డి వంగా.. రోమాంచ‌కం నుంచి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్‌

ABN, Publish Date - Jul 23 , 2026 | 04:51 PM

సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న 'రోమాంచకం' సినిమా నుంచి 'రాధా రమణ' రొమాంటిక్ సాంగ్ విడుదలైంది.

Romanchakam

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇప్పుడు నిర్మాతగా మరో ఆసక్తికరమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన సమర్పిస్తున్న తాజా తెలుగు చిత్రం రోమాంచకం (Romanchakam). ఈ సినిమాలో 'మేమ్ ఫేమస్'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా నటిస్తుండగా, '8 వసంతాలు' ఫేమ్ అనంతిక (Ananthika) కథానాయికగా కనిపించనుంది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా 'రాధా రమణ (Radha Ramana Lyrical) అంటూ సాగే యూత్‌ఫుల్ రొమాంటిక్ లిరిక‌ల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పాటలో సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉండగా, విజువల్స్‌ కూడా ఫ్రెష్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి. ప్రేమ భావోద్వేగాలను అందంగా ఆవిష్కరించిన ఈ గీతం యువతను ఆకర్షించేలా రూపొందింది. అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (Chandrabose) సాహిత్యం అందించిన ఈ గీతాన్ని వాసుకి వైభవ్ ( Vasuki Vaibhav) స్వీయ సంగీతంలో ఆల‌పించ‌గా పాట చాలా ప్రెష్‌గా ఉండి ఓ కొత్త అనుభూతిని క‌లిగించేలా ఉండి మ‌రో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

లవ్, కామెడీ, సస్పెన్స్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న 'రోమాంచకం'ను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కొత్త తరహా కథతో ప్రేక్షకులను అలరించేందుకు 'రోమాంచకం' సిద్ధమవుతోంది.

Updated Date - Jul 23 , 2026 | 04:51 PM