అయ్యగారు.. ఊర మాస్ డ్యాన్స్ ఇరగదీశారు
ABN, Publish Date - Jun 27 , 2026 | 07:25 PM
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) తన ఆశలన్నీ లెనిన్ పైనే పెట్టుకున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం లెనిన్ (Lenin).
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) తన ఆశలన్నీ లెనిన్ పైనే పెట్టుకున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం లెనిన్ (Lenin). అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఉండాల్సింది. కానీ, కొన్ని కారణాల వలన వాయిదా పడి జులై 10 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. వరుసగా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే లెనిన్ నుంచి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా లెనిన్ లోని మరో లిరికల్ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.
రావణ సంధనాల అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటుంది. జాతరలో వచ్చే సాంగ్ లా విజువల్స్ ని బట్టి కనిపిస్తోంది. ఇక ఈ సాంగ్ లో అయ్యగారు మాస్ డ్యాన్స్ ఇరగదీశాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. దానికి తగ్గట్లుగానే అఖిల్.. లుక్, యాస మార్చి కొత్తగా కనిపించాడు. ఇక ఈ సాంగ్ లో కూడా అఖిల్ అదరగొట్టేశాడు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. థమన్ సంగీత సారథ్యంలో కరీముల్లా ఆలపించాడు.
లెనిన్ లో ఒక్కో సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోందనిపిస్తోంది. రావణ సంధనాల ఫుల్ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. సాంగ్స్ చూస్తుంటే అఖిల్ ఈసారి గట్టి హిట్ అందుకునేలా ఉన్నాడని అక్కినేని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈసారి అయినా అయ్యగారు హిట్ అందుకుంటారా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే లెనిన్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.