సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raasi: అజయ్‌ ఘోష్‌ ఎవరో తెలీదు.. నేను ఆ అజయ్‌ అనుకున్నా..

ABN, Publish Date - Apr 18 , 2026 | 02:14 PM

ఒకప్పుడు పవన్‌కల్యాణ్‌, బాలకృష్ణ, వంటి స్టార్‌లతో నటించిన రాశీ ఇప్పుడు అజయ్‌ ఘోష్‌ భార్యగా నటించిందని కొందరు కామెంట్స్‌ చేయగా ఆమె స్పందించారు.

సీనియర్‌ నటి రాశీ (Raasi) తాజాగా ‘పాపం ప్రతాప్‌’ (papam Pratap) చిత్రంలో నటించారు. తిరువీర్‌, పాయల్‌ రాధాకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్ర బృందం ఏర్పాటు చేసిన థ్యాంక్స్‌ మీట్‌లో సినిమా ఫస్ట్‌ డే షూటింగ్‌లో తనకు ఎదురైన సరదా సంఘటన గురించి రాశీ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ఆమె తిరువీర్‌కి తల్లిగా, అజయ్‌ ఘోష్‌కు భార్యగా నటించారు.

ఒకప్పుడు పవన్‌కల్యాణ్‌, బాలకృష్ణ, వంటి స్టార్‌లతో నటించిన రాశీ ఇప్పుడు అజయ్‌ ఘోష్‌ భార్యగా నటించిందని కొందరు కామెంట్స్‌ చేయగా ఆమె స్పందించారు. 'నటిగా దర్శకుడు ఏం చెబితే అది చేసుకెళ్లడం నాకు అలవాటు. దర్శకుడు స్టోరీ చెప్పినప్పుడు, అజయ్‌ ఘోష్‌ అంటే యాక్టర్‌ అజయ్‌ అనుకున్నాను. నాకు ఇప్పటి ఆర్టిస్ట్‌ల పేర్లు అంతగా తెలీదు. మనిషిని చూస్తే గుర్తుపడతాను. అజయ్‌ ఘోష్‌ ‘రంగస్థలం’ సినిమాలో చేశారు. కానీ నాకు ఆయన పేరు తెలియదు. డైరెక్టర్‌ ‘పాపం ప్రతాప్‌’ స్టోరీ చెప్పినప్పుడు అజయ్‌ ఘోష్‌ అని చెబితే.. నేను పొడవుగా ఉండే యాక్టర్‌ అజయ్‌ అనుకొని ఒప్పుకున్నాను. ఆయన యంగ్‌గా ఉంటారు కాబట్టి, ఫస్ట్‌డే నేను జడ వేసుకొని సెట్స్‌కి వెళ్లాను. ఒకతను వచ్చి ‘మేడం మీరు హీరోయిన్‌లాగా ఉన్నారు’ అన్నారు. మదర్‌ లాగా కనిపించడం లేదు అంటే, నన్ను ఏమి చేయమంటారని అడిగాను. జడ ముడి వేసుకోమని చెప్పారు. రెడీ అయ్యి సెట్‌లో అజయ్‌ కోసం వెతుకుతున్నాను. అక్కడ అజయ్‌ ఘోష్‌ గారు చైర్‌లో కూర్చొని ఉంటే, ఈయన మన మామయ్య క్యారక్టర్‌ ఏమో అనుకున్నాను. అప్పుడొక అమ్మాయి వచ్చి ఆయనే అజయ్‌ ఘోష్‌ అని చెబితే అప్పుడు నాకు తెలిసింది. (నవ్వుతూ). దీని గురించి డైరెక్టర్‌ని అడిగితే ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు కదా అందులో భాగంగా ఇలా అని చెప్పారు. ఫెంటాస్టిక్‌ ఆర్టిస్ట్‌ ఆయన. సింగిల్‌ టేక్‌లో సీన్స్‌ చేసేవారు. ‘ప్రేయసి రావే’ సినిమా అబ్బాయిలకి ఎక్కువగా కనెక్ట్‌ అయింది. ‘పాపం ప్రతాప్‌’ సినిమా అమ్మాయిలకి, ఫ్యామిలీ అందరికీ కనెక్ట్‌ అయింది. నేను మా అమ్మాయితో కలిసి ఈ సినిమా చూశాను. ‘పాపం ప్రతాప్‌ 2’ ఎప్పుడొస్తుంది అని మా అమ్మాయి అడిగింది. చాలా ఏళ్ల తర్వాత ఓ సక్సెస్‌ మీట్‌లో నేనూ ఉన్నాననే ఆనందంలో ఉన్నాను’ అని రాశీ అన్నారు. ఈ పాత్రకు రాశీ అంగీకరించడంతో జన్మ ధన్యమైందని, అజయ్‌ ఘోష్‌ పక్కన వైఫ్‌ క్యారక్టర్‌ అంటే, ఏంటి నువ్వు మనిషివేనా అన్నట్లు చూశారని నవ్వుతూ చెప్పారు దర్శకుడు ఎస్పీ దుర్గ నరేష్‌.

Updated Date - Apr 18 , 2026 | 02:53 PM