Raasi: ‘ది రెడ్ బ్యాగ్’లో సావిత్రిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
ABN , Publish Date - May 18 , 2026 | 11:00 PM
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన రాశి, ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో ఆమెకు మంచి పాత్రలే పడుతున్నాయి.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన రాశి (Raasi), ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో ఆమెకు మంచి పాత్రలే పడుతున్నాయి. ఇప్పుడామె నటిస్తోన్న ఓ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెమరీ మేకర్స్ బ్యానర్ పై డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న రాశీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సావిత్రి పాత్రలో రాశీ ‘ది రెడ్ బ్యాగ్’ (Raasi in The Red Bag) సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్‌ను పోషిస్తున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఈ పాత్రకు సంబంధించిన గెటప్, లుక్స్ ఎంత సింపుల్‌గా ఉన్నాయో.. ఆమె లుక్ అంత ఇంటెన్స్‌గా ఉంది. ఈ చిత్రాన్ని మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో రాశీ నటించారని, ఆమె పాత్ర ప్రేక్షకులను థ్రిల్ ఇస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ చేశామని, టీజర్ కూడా రెడీ అవుతుందని ఈ సందర్భంగా టీమ్ తెలిపింది.
రాబోయే టీజర్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ అవుతుందని, తొలి సినిమానే అయినా, నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందిస్తుండగా, ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!
కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ
మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!