సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏ బట్టలు.. ధరించాలో మాకు తెలుసు! మీకేంటి

ABN, Publish Date - Mar 13 , 2026 | 09:01 PM

ఏ అమ్మాయికి అయినా తనకు కంఫర్ట్ గా ఉండే  దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయి ఇష్టం. 

'ఏ అమ్మాయికి అయినా తనకు కంఫర్ట్ గా ఉండే  దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయి ఇష్టం.  మేము ఏ దుస్తులు ధరిస్తే మీకేంటి' అంటూ ఫైర్ అయ్యారు నటి రాశి ఖన్నా. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.  పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ సినిమా 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దుస్తులకు సంబంధించి, పెళ్ళి గురించి  అడిగిన ప్రశ్నలకు రాశి ఇలా సమాధానమిచ్చారు. 'నా పెళ్లి ఎప్పుడో నాకే తెలియదు. ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అన్నది కూడా తెలీదు. ప్రస్తుతం   సినిమాలతో బిజీగా ఉన్నా. పెళ్ళికి  టైం  లేదు' అన్నారు.  పెళ్లి తర్వాత నటిస్తారా? అన్న ప్రశ్నకు 'పెళ్లి తర్వాత కూడా అమ్మాయిలు వర్క్‌ చేయాలి. నటనకు ఎందుకు దూరమవ్వాలి' అని ప్రశ్నించారు.  

నటనకు ప్రాధాన్యం కనిపిస్తుంది

'గత చిత్రాల ఫలితం గురించి ఇప్పుడు అనవసరం. ప్రస్తుతం నా దృష్టి అంతా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపైనే. ఇందులో నాతోపాటు శ్రీలీలే కూడా ఉంది. క్యారెక్టర్ లెంగ్త్ ఎవరిది  ఎంత అనేది  కరెక్ట్‌గా తెలియదుగానీ  ఇద్దరం  ఇందులో హీరోయిన్లమే.  పాత్రలకు మంచి స్కోప్‌ ఉంది. ఇందులో మా ఇద్దరి నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.   

Updated Date - Mar 13 , 2026 | 09:15 PM