రాకా: శక్తీ విలన్ నుంచి.. పాన్ ఇండియా సినిమాకు టైటిల్ దాకా..
ABN, Publish Date - Apr 09 , 2026 | 09:18 AM
‘మీ అన్ని ప్రశ్నలకు సమాధానం... నా బడా బేఠా రాకా’ అన్న డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మీ అన్ని ప్రశ్నలకు సమాధానం... నా బడా బేఠా రాకా’ (RAAKA) అన్న డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ‘శక్తి’ (Sakthi) సినిమాలో డైలాగ్. ఆ చిత్రంలో ఈజిప్ట్ నుంచి ఇండియాకు విలన్లు వస్తారు. అందులో రాకా పేరుతో ఓ గుండు విలన్ ఉంటాడు. ఇప్పుడా పేరు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్ ఖరారు చేశారు. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. బుధవారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘రాకా’ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. ఇప్పుడంతా ‘రాకా’ అంటే అర్థమేంటి అన్నదానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంతకు ముందు ఆ పేరును ఏ సినిమాలో వాడారు అన్నదానిపై నెటిజన్లు సెర్చ్ చేశారు. ‘రాకా’ అనేది ఇంతకుముందుకు ‘శక్తి’ సినిమాలో విలన్ పేరు. మెహర్ రమేశ్ పదిహేనేళ్ల క్రితమే ఈ పేరును శక్తి సినిమాలో ఉపయోగించారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రానికి ఈ సినిమా టైటిల్ పెట్టడంతో ఒక్కసారిగా ఆ టైటిల్, శక్తి సినిమాలో లేడీ విలన్ రాకా పేరుతో చెప్పే డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ‘రాకా’ అంటే అర్థమేంటి అన్నదానిపై కూడా చర్చ, సెర్చింగ్ విపరీతంగా జరుగుతోంది.
'రాకా' గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు.
పౌర్ణమి సమయంలో మనుషులు తోడేళ్లుగా మారేవారని చెబుతుంటారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో బన్నీ గుండుతో, ముఖంపై చేయి అడ్డుపెట్టుకుని ఉన్నారు. ఆ లుక్ తోడేలును గుర్తుచేస్తోంది. హీరో పౌర్ణమి రోజున ఇలా మారతాడని నెటిజన్లు తమ పోస్టుల్లో పేర్కొన్నారు
పౌర్ణమిని రాకా అని అంటుంటారు. చీకటి అనే చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఆ టైటిల్ పెట్టారేమో అని అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.
రాక్షసుడిని రాకాస అని కూడా అంటారు. ఇందులో ఐకాన్ స్టార్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారని మొదటి నుంచి టాక్ నడుస్తోంది. నెగటివ్ రోల్ కోసం ‘రాకా’ టైటిల్ అని కొందరు అనుకుంటున్నారు.