Pushpa In Japan: జపాన్ లో పుష్ప రాజ్ హవా.. అభిమానుల ఆప్యాయ స్వాగతం
ABN, Publish Date - Jan 13 , 2026 | 04:03 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu Arjun) నటించిన ‘పుష్ప:ది రూల్’ (Pushpa 2)చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించి బన్నీ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu Arjun) నటించిన ‘పుష్ప:ది రూల్’ (Pushpa 2)చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించి
బన్నీ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్‌లో సందడి చేయనుంది. ఈ నెల 16న ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin) టైటిల్‌తో జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు టోక్యో చేరుకున్నారు. అక్కడి అభిమానులు ఆయన్ను ఆప్యాయంగా పలకరించి ఆహ్వానం పలికారు. టోక్యో అందాలను ఫోటో తీసి పోస్ట్ చేశారు. సింపుల్‌గా టోక్యో అనే క్యాప్షన్ పెట్టారు.
గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి పుష్ప మ్యాడ్‌నెస్‌ను జపాన్ సిల్వర్ స్ర్కీన్ మీదకు తీసుకువస్తున్నారు. ఇండియా భారీ విజయం సాధించిన ఈ చిత్రం జపాన్‌లో కూడా అలరిస్తుందని టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న జపాన్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో జపాన్‌కు సంబంధించి ఓ స్పెషల్ రెఫరెన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప ఎంట్రీ ఫైట్ సీన్ జపాన్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ స్వయంగా జపనీస్‌లో డైలాగ్స్ చెప్పటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల్లో పుష్ప 2పై మరింత ఆసక్తిని పెంచనున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రష్మిక కథానాయిక. ఫవాద్ పాజిల్ కీలక పాత్రలో నటించారు.