సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగు అందం గౌరీ ప్రియను టాలీవుడ్ గుర్తిస్తుందా..

ABN, Publish Date - Jul 24 , 2026 | 07:56 PM

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఉన్నవారికి సక్సెస్ లు తక్కువ.. అవకాశాలు తక్కువ. అందం అభినయం ఉన్నా కూడా ఎందుకో మేకర్స్ అందరూ ముంబై, బెంగళూరు భామల వెంట పడుతూనే ఉన్నారు.

Sri Gouri Priya

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఉన్నవారికి సక్సెస్ లు తక్కువ.. అవకాశాలు తక్కువ. అందం అభినయం ఉన్నా కూడా ఎందుకో మేకర్స్ అందరూ ముంబై, బెంగళూరు భామల వెంట పడుతూనే ఉన్నారు. నటనలో తెలుగు అమ్మాయిలు చేయలేరు అనుకుంటున్నారో ఏమో.. కానీ, తెలుగు హీరోయిన్స్ నటిస్తే ఎలా ఉంటుందో నిరూపించింది అచ్చ తెలుగు అందం శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya). కాకినాడకు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ రీసెంట్‌గా విడుదలైన చెన్నై లవ్ స్టోరీ చిత్రంతో శభాష్ అనిపించుకుంటుంది.


సింగర్ గా కెరీర్ ప్రారంభించిన గౌరీ మెయిల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత మ్యాడ్ సినిమాతో అమ్మడు అందరి దృష్టిలో పడింది. ఇక గౌరీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యింది మాత్రం ట్రూ లవర్ సినిమాతోనే. తమిళ్ సినిమా అయినా తెలుగులో చూసిన ప్రేక్షకులు అమ్మడి యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. గ్లామర్, డ్యూయెట్లకు పరిమితం కాకుండా కేవలం పెర్ఫార్మన్స్‌తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిన్నది ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీలో కూడా డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది.


చెన్నై లవ్ స్టోరీ చిత్రంలో ఆమెది సాధారణ హీరోయిన్ పాత్ర అనుకుంటే పొరపాటే. ఈ కథకు ఆమె హీరో. అందుకే ఈ సినిమాకు మొదట హీరో పేరు కాకుండా హీరోయిన్ పేరు ఉంటుంది. కిరణ్ అబ్బవరం మొదటే చెప్పాడు. ఈ సినిమాకు గౌరీనే హీరో అని.. అన్నట్లుగానే ఆమె సినిమా మొత్తం అదరగొట్టేసింది. కొన్ని షాట్స్ లో కిరణ్ కూడా కనిపించలేదు.. సినిమా ఓపెనింగ్ నుంచి క్లైమాక్స్ వరకు కథనమంతటినీ తన భుజాలపై వేసుకుని నడిపించిందని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ఒక పాత్ర ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి రాలేదు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆమెకు దక్కుతున్న అప్లాజ్ చూస్తుంటే, ఆమెలోని అసలైన టాలెంట్‌ను ఇండస్ట్రీ గుర్తించి.. మరిన్ని అవకాశాలు అందిస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఒక తెలుగు హీరోయిన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలదు అని శ్రీ గౌరీప్రియ మరోసారి నిరూపించింది. మరి అమ్మడి కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Updated Date - Jul 24 , 2026 | 08:01 PM