సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chennai Love Story: తొలి ప్రేమ.. మలిప్రేమ.. ఇలా ఎన్నో కాన్సెప్టులతో..

ABN, Publish Date - Jul 05 , 2026 | 05:53 PM

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమా లవ్‌ కార్నివాల్‌ ఈవెంట్‌ విజయవాడలో ఘనంగా జరిగింది.

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమా లవ్‌ కార్నివాల్‌ ఈవెంట్‌ విజయవాడలో ఘనంగా జరిగింది. రాజ్‌ యువరాజ్‌ థియేటర్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఈ సినిమాలో ‘హొయిలా హొయిలా’ అంటూ సాగే ని నాలుగో పాటను విడుదల చేశారు.

ఈ వేదికగా నిర్మాత ఎస్‌కెఎన్‌ మాట్లాడుతూ ‘సొంతూరు విజయవాడలో మా చెన్నై లవ్‌ స్టోరీ’ ఈవెంట్‌ జరగడం ఆనందంగా ఉంది. విజయవాడ రాగానే ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నాయి. ‘విజయవాడ అంటే ఇంద్రకీలాద్రి గడ్డ.. మా ఇంద్ర సినిమా అడ్డా’. ఇక్కడే మెగాస్టార్‌, పవర్‌స్టార్‌ నటించిన ఎన్నో చిత్రాలు చూసి ఎంజాయ్‌ చేశాం. అభిమానులుగా సందడి చేశాం. ఎన్నో మెమొరీస్‌ విజయవాడతో ఉన్నాయి. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమలో ఎన్నో అందమైన లొకేషన్స్‌ ఉన్నాయి. మనం షూటింగ్స్‌ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లనక్కర్లేదు. మేము ‘చెన్నై లవ్‌ స్టోరీ’ షూటింగ్‌ ఎక్కువగా ఏపీలోనే చేశాం. బీచ్‌లో పెద్ద పెద్ద లైట్‌ హౌస్‌ సెట్స్‌ వేశాం. ఆ పర్మిషన్స్‌ అన్నీ ఒక్క ఫోన్‌ కాల్‌ తో మాకు వచ్చాయంటే ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ది పట్ల ఎంత చిత్తశుద్థితో ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై 24 నాకు ఎంతో ఇష్టమైన డేట్‌. ఆ రోజునే ఇంద్ర, తొలిప్రేమ జూలై 24నే రిలీజ్‌ అయ్యాయి. మెగా అభిమానిగా అదొక కల్ట్‌ డేట్‌. ఈ నెల 23 నుంచే ప్రీమియర్స్‌ పడుతాయి. క, కె ర్యాంప్‌ సక్సెస్‌ తర్వాత మా సినిమా ఒప్పుకున్నారు కిరణ్‌ గారు. ఆయన 60 నిమిషాల కథ విని సినిమా చేస్తున్నానంటూ ముందుకొచ్చారు. సినిమాను భుజానా వేసుకుని నడిపిస్తున్నారు.

మీలో ఒకరిగా ఎదిగి పైకి వచ్చిన వ్యక్తి కిరణ్‌. ఆయన మంచి హీరోనే కాదు దర్శకుడు, నిర్మాత కూడా. కిరణ్‌ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. మా సినిమాల్లో ఎక్కువ తెలుగమ్మాయిలకే అవకాశాలిస్తున్నాం. ఈ చిత్రంతో శ్రీగౌరి ప్రియ మరింత గుర్తింపు తెచ్చుకుంటారు. నాకు ఎప్పుడూ తోడుండే స్నేహితుడు ధీరజ్‌, రెండుసార్లు జాతీయ అవార్డ్‌ గెలుచుకున్న మిత్రుడు సాయి రాజేష్‌తో కలిసి వర్క్‌ చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో తొలి ప్రేమ, మలిప్రేమ.. ఇలా మంచి కాన్సెప్ట్‌లు ఉన్నాయి. ప్రేమ రెండక్షరాలు, జీవితం నాలుగు అక్షరాలు. కెరీర్‌లో మనం గెలిస్తే ఏ ప్రేమైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. బెజవాడ యూత్‌ అందరికీ నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను’ అన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 05:53 PM