ఆడదాని శాడిజం చూసి ఎంజాయ్ చేశారు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jul 05 , 2026 | 04:36 PM
టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ఎప్పుడు మాట్లాడినా సంచలనమే. మొహమాటం లేకుండా, ముక్కుసూటిగా రియాలిటీని మాట్లాడటం ఆయన స్టైల్.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ఎప్పుడు మాట్లాడినా సంచలనమే. మొహమాటం లేకుండా, ముక్కుసూటిగా రియాలిటీని మాట్లాడటం ఆయన స్టైల్. ప్రస్తుతం ఆయన నిర్మించిన సినిమా లెనిన్ (Lenin). అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రం జులై 10 న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగవంశీ ఈ ఏడాది హిట్ సినిమా ఆబ్సెషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జనాలు థ్రిల్లర్ సినిమాలను, ముఖ్యంగా డార్క్ కంటెంట్‌ను ఏ మైండ్‌సెట్‌తో చూస్తారనే పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టాడు.
'జనాలు ఆబ్సెషన్ సినిమాను దాని టెక్నికల్ వాల్యూస్ కోసమో, కెమెరా వర్క్ కోసమో చూడలేదు. కేవలం ఆడపిల్లలోని శాడిజం చూసి ఎంజాయ్ చేయడానికే చూశారు. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి ఎవరికీ మనసు రాదు, ఒప్పుకోరు కూడా' అంటూ నాగవంశీ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరియు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన అన్నది అక్షరాలా నిజం.. జనాలు ఆ గిల్టీ ప్లెజర్ కోసమే చూస్తారు అని కొందరు నాగవంశీకి సపోర్ట్ చేస్తుంటే, ఇలా జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు అని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఆడియన్స్ మైండ్ సెట్‌ని ఇంత ఓపెన్‌గా డికోడ్ చేసి నాగవంశీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.