నాగవంశీ: అనుదీప్ సినిమాను స్కేల్ తో కొలవద్దు

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:31 PM

'సినీ నేపథ్యంలో దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే  క్యూట్ కామెడీ సినిమా ఇది. ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా ఉంటుంది.

'సినీ నేపథ్యంలో దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే  క్యూట్ కామెడీ సినిమా ఇది. ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు  నవ్వుతూనే ఉంటారు. ఇది అనుదీప్ సినిమా..స్కేల్ తో కొలవద్దు. నవ్వుకోవడానికి సినిమాకి రండి. అసలు నిరాశ చెందరు.  థియేటర్ నుండి నవ్వుతూ బయటకు వెళ్తారు' అని నిర్మాత సూర్య దేవర  నాగ వంశీ (Naga Vamsi) అన్నారు.

విశ్వక్ సేన్(Vishwak Sen), కె.వి. అనుదీప్ (KV Anudeep) కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ' (Funky). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. కయాదు లోహర్‌ కథానాయిక. ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో  విశ్వక్ సేన్ మాట్లాడుతూ  'భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. మామూలుగా నా సినిమాల్లో పాటలు బాగుంటాయి అంటారు. అయితే నా గత రెండు చిత్రాలలో పాటలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. 'ఫంకీ' సినిమాకి భీమ్స్ మంచి పాటలు ఇచ్చారు. సినిమా విడుదల తర్వాత పాటలకు ఆదరణ ఇంకా పెరుగుతుందనే నమ్మకం ఉంది.  ఫిబ్రవరి 13 ఫంకీ థియేటర్లలోకి వస్తోంది. స్నేహితులు, కుటుంబం సభ్యులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రెండు గంటలు ఎలా గడిచిందో కూడా తెలియనంతగా సినిమా మీకు వినోదాన్ని పంచుతుంది' అన్నారు.

కయాదు లోహర్‌ మాట్లాడుతూ 'ట్రైలర్  ఫంకీ ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది.  సినిమాని విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. నేను పని చేసిన దర్శకులలో  విభిన్న శైలి ఉన్న దర్శకుడు అనుదీప్.  ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బావుంది. నా కెరీర్ లో మొదటి కామెడీ సినిమా ఇది' అని అన్నారు. 

దర్శకుడు అనుదీప్ కె.వి మాట్లాడుతూ 'కథ వినగానే ఈ సినిమా చేయడానికి అంగీకరించిన విశ్వక్ సేన్ కి కృతఙ్ఞతలు. కయాదు లోహర్‌ కి తెలుగు రాకపోయినా.. తెలుగు  డైలాగులు  నేర్చుకొని చెప్పింది.  కెమెరా వర్క్,  భీమ్స్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు ఎస్సెట్. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరిని అలరిస్తుంది' అన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 05:35 PM