సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'పోలీస్ వారి హెచ్చరిక'.. నిర్మాత క‌న్నుమూత‌! స్విమ్మింగ్ పూల్‌లో ఈత  కొడుతూ.. 

ABN, Publish Date - Mar 24 , 2026 | 01:07 PM

'పోలీస్ వారి  హెచ్చరిక' సినిమాతో నిర్మాతగా మారి సినీరంగ ప్రవేశం చేసిన బెల్లి జనార్దన్‌ ఇకలేరు.

'పోలీస్ వారి హెచ్చరిక' సినిమాతో నిర్మాతగా మారి సినీరంగ ప్రవేశం చేసిన బెల్లి జనార్ధన్ (Belli Janardhan) ఇకలేరు. ఉగాది పండుగ  సందర్భంగా అత్తగారి ఊరైన కట్టంగూరుకు కుటుంబ సభ్యులతో  కలిసి వెళ్ళిన ఆయన అక్కడ మరణించారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత  కొడుతుండగా ప్రమాదవశాత్తు  నీటి అడుగు భాగానికి బలంగా తల తగిలి అక్కడికక్కడే ఊపిరి వదిలారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ నెల 23న స్వగ్రామమైన నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో మాజీ సైనికుడైన జనార్దన్‌ అంత్యక్రియలు  సైనిక లాంఛనాలతో  జరిగాయి.బెల్లి జనార్ధన్ ఆకస్మిక మరణం పట్ల తీవ్రమైన  దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ 'పోలీస్ వారి హెచ్చరిక' చిత్ర బృందం తరపున దర్శకుడు బాబ్జీ నివాళి అర్పించారు. 

Updated Date - Mar 25 , 2026 | 08:09 AM