సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: పుట్టినరోజు స్పెషల్.. ప్రియాంక లుక్ అదిరింది

ABN, Publish Date - Jul 18 , 2026 | 10:27 AM

శనివారం ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా సెట్స్‌లోని కొత్త స్టిల్స్‌ను విడుదల చేసింది.

మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో  మందాకిని పాత్ర నటిస్తున్నారు. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా సెట్స్‌లోని కొత్త స్టిల్స్‌ను విడుదల చేసింది. అలాగే రాజమౌళి కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రియాంక ఫొటోలను పంచుకుంటూ, 'ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పుకణిక అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. 'మందాకినికి హ్యాపీ బర్త్‌డే' అంటూ  మహేశ్‌బాబు కూడా ప్రియాంకకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ‘వారణాసి’ సినిమా విషయానికి వస్తే.. మహేశ్‌బాబు ఇందులో రుద్ర మరియు శ్రీరాముడు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పురాణ గాథలు, సాహసయాత్ర, కాలయానం అంశాలను మిళితం చేసిన భారీ విజువల్ స్పెక్టాకిల్‌గా ఈ చిత్రాన్ని రాజమౌళి రూపొందిస్తున్నారు. 

భారీ వ్యయంతో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, అనంతరం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో 'వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Updated Date - Jul 18 , 2026 | 10:40 AM