సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రియాంకా అరుళ్‌ మోహన్‌:  సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది

ABN, Publish Date - Mar 03 , 2026 | 11:54 AM

హీరోయిన్‌ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు.

విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ప్రముఖ నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని హీరోయిన్‌ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ తన మనసులోని మాట వెల్లడించారు. ‘డాక్టర్‌’, ‘డాన్‌,’ ‘ఎదర్కుమ్‌ తుణిందవన్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ వంటి చిత్రాల్లో నటించిన ప్రియాంక.. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని వుంది. సౌందర్య సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయకాంత్‌, కార్తిక్‌, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున వంటి అగ్రహీరోలతో నటించారు. తన నటనతో పాటు చూపులతో లక్షలాదిమందిని అభిమానులుగా చేసుకున్నారు. అందుకే ఆమె బయోపిక్‌లో నటించాలని కోరిక ఉంది’ అని వెల్లడించారు. 

Updated Date - Mar 03 , 2026 | 01:42 PM