సుకుమార్.. బన్నీ వాస్.. ప్రియదర్శి.. క్రేజీ సినిమా
ABN, Publish Date - Jun 12 , 2026 | 04:13 PM
టాలీవుడ్ లో కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. దానిని బట్టి సక్సెస్ను కూడా ఊహించవచ్చు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.
టాలీవుడ్ లో కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. దానిని బట్టి సక్సెస్ను కూడా ఊహించవచ్చు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. నిర్మాత బన్నీ వాస్, లెక్కల మాస్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనేది త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో సినిమా అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. బన్నీ వాస్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ చేయడానికి సన్నాహాల్లో ఉన్నారు.