సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priya Bhavani Shankar: ప్రియుడితో బ్రేకప్‌.. అలాంటిదేం లేదు..  ప్రియా భవానీ శంకర్‌

ABN, Publish Date - Jan 03 , 2026 | 10:06 AM

తన కాలేజ్‌మేట్‌, స్నేహితుడు, ప్రియుడైన రాజవేల్‌తో హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ ప్రేమ కథపై క్లారిటీ ఇచ్చారు.


తన కాలేజ్‌మేట్‌, స్నేహితుడు, ప్రియుడైన రాజవేల్‌తో హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ తెగదెంపులు చేసుకుందనే వదంతులకు  తెరదించుతూ తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో పాటు తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో తమ ప్రేమ బ్రేకప్‌ కాలేదని ఆమె ఒక్క ఫొటోతో తేటతెల్లం చేశారు. కాగా, బుల్లితెర యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ శంకర్‌... ‘మేయాద మాన్‌’ మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కడైకుట్టి సింగం’, ‘మాన్‌స్టర్‌’, ‘యానై’, ‘తిరుచిట్రాంబలం’, ‘రత్నం’, ‘డిమాంటి కాలనీ-2’ వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. సాధారణంగా  కొంతమంది హీరోయిన్లు ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ, ప్రియా భవానీ మాత్రం తన ప్రియుడుతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళుతూ, అతడితో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేస్తుంటారు.  

Updated Date - Jan 03 , 2026 | 10:19 AM