సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priya Atlee: రాకా టీమ్‌ వరుస శుభవార్తలు..

ABN, Publish Date - Apr 20 , 2026 | 12:59 PM

అల్లు అర్జున్‌ (Allu Arjun) పుట్టిన రోజు మొదలు ‘రాకా’ (Raaka) టీమ్‌ నుంచి వరుస శుభవార్తలు అందుతున్నాయి.

అల్లు అర్జున్‌ (Allu Arjun) పుట్టిన రోజు మొదలు ‘రాకా’ (Raaka) టీమ్‌ నుంచి వరుస శుభవార్తలు అందుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న దీపికా పడుకోన్‌ (Deepika padukone) రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు దర్శకుడు అట్లీ (Atlee) వంతు వచ్చింది. ఆయన భార్య ప్రియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అట్లీ ఒక బ్యూటిఫుల్‌ పోస్ట్‌తో అభిమానులకు తెలిపారు. తన కొడుకుకు ఒక చిట్టి చెల్లెలు వచ్చింది అన్నట్టు ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ పోస్ట్‌కు కాజల్‌, అనన్య పాండే, సమంత, రష్మిక మందన్నా, నజ్రియా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 02:22 PM