డేవిడ్ రెడ్డి.. ప్రిన్స్ బ్యూటీని దింపాడుగా
ABN, Publish Date - Mar 06 , 2026 | 08:03 PM
మిరాయ్ తరువాత మంచు మనోజ్ (Manchu Manoj) లైఫ్ మొత్తం మారిపోయింది. భైరవం సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా.. మిరాయ్ సినిమా మనోజ్ ను నటుడిగా నిలబెట్టింది.
మిరాయ్ తరువాత మంచు మనోజ్ (Manchu Manoj) లైఫ్ మొత్తం మారిపోయింది. భైరవం సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా.. మిరాయ్ సినిమా మనోజ్ ను నటుడిగా నిలబెట్టింది. దీని తరువాత వరుస సినిమాలు క్యూ కట్టాయి. ఒక పక్క విలన్ గా చేస్తూనే ఇంకోపక్క హీరోగా కూడా నటిస్తున్నారు మంచు మనోజ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం డేవిడ్ రెడ్డి (David Reddy). హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగుల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న డేవిడ్ రెడ్డి సినిమా నుంచి హీరోయిన్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.ఉక్రెయిన్ నటి మరియా ర్యబోషప్క ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్నారు. ఈ చిత్రంలో క్లారా అనే పాత్రలో ఆమె నటిస్తోన్నట్లు మేకర్స్ తెలిపారు. విదేశీ మహిళగానే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించారు. ఆమె ప్రేమ యుద్ధం అనే క్యాప్షన్ మరియా పాత్ర ఎలా ఉండబోతుందో తెలుపుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరియాకి ఇదే మొదటి తెలుగు సినిమా. తమిళ్ లో ఆమె ప్రిన్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా తెలుగు డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిన్స్ సినిమా 2022 లో రిలీజ్ అయ్యి పరాజయాన్ని అందుకుంది. దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తరువాత మరియా మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆమె విదేశీ మహిళాగానే కనిపిస్తుండడం విశేషం. మరి ఈ సినిమాతో మనోజ్- మరియా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.