సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పుడు చచ్చిపోతామన్నారు.. పూరి - ఛార్మి నిజ స్వరూపం బయటపెట్టిన ప్రొడ్యూసర్

ABN, Publish Date - Sep 28 , 2026 | 09:31 PM

హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్లుగా చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Chaitanya Reddy

హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ (Prime Show Entertainment) బ్యానర్‌పై నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్లుగా చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ వరుస సినిమాలతో బిజీగా మారింది. అయితే, పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ వివాదంలో చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి పేర్లు బాగా వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతన్య రెడ్డి ఆ వివాదం గురించి నోరు విప్పారు. ఆ సినిమా హక్కులను తీసుకోవడం వల్ల తాము భారీగా నష్టపోయామని, దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా ఛార్మి, పూరి తమను ఎంతగానో మోసం చేసినట్లు చెప్పుకొచ్చారు.


సినిమా విడుదల సమయానికి పూరి జగన్నాథ్, ఛార్మిల పాత సినిమాల ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ కాకపోవడంతో తాము ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని భావించామని, కానీ ఆ సమయంలో ఛార్మి, పూరి జగన్నాథ్‌లు రోజూ గంటల తరబడి ఫోన్ కాల్స్ చేసి, 'మీరు కాపాడకపోతే మేము చచ్చిపోవడం తప్ప మరో మార్గం లేదు, రిలీజ్ తర్వాత వచ్చే నష్టాలను మేము చూసుకుంటాం'అని బతిమిలాడటంతో ఎమోషనల్ అయ్యి హెల్ప్ చేశామని ఆమె వివరించారు


అయితే సినిమా విడుదలైన మరుసటి రోజే ఛార్మి మాట మార్చేసిందని, ఫోన్ కాల్స్ ఎత్తకుండా బ్లాక్ చేయడమే కాకుండా, కనీసం ఇంటికి కూడా రానివ్వకుండా అన్యాయం చేసిందని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. పూరి టాక్స్ లో మనుషుల వాల్యూస్, ఎథిక్స్ గురించి మాట్లాడే పూరి జగన్నాథ్, ప్రాక్టికల్‌గా మాత్రం తమను రోడ్డున పడేసేలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ చేదు అనుభవంతో విసిగిపోయి సినిమాలు వదిలేసి మళ్లీ యుఎస్ వెళ్లిపోదామనే తీవ్ర నిరాశకు గురయ్యామని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఫిలిం ఛాంబర్ కూడా ఈ విషయంలో తమకు మద్దతుగా నిలవకపోవడంతోనే, ప్రొడ్యూసర్లకు మద్దతుగా ఉండేందుకు నిర్మాతల మండలి (ఈసీ) ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని చైతన్య రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం చైతన్య రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూరి జగన్నాథ్, ఛార్మి నిజస్వరూపం ఇదా అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 09:36 PM