Preity Mukundan: కన్నప్ప బ్యూటీ.. కత్తిలాంటి ఛాన్స్ పట్టిందే
ABN , Publish Date - Jan 20 , 2026 | 08:43 PM
ఇండస్ట్రీలో అదృష్టం ఎవరిని ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఒక చిన్న సీన్, ఒక సాంగ్, ఒక లుక్ కూడా వారిని పాపులర్ చేయగలదు
Preity Mukundan: ఇండస్ట్రీలో అదృష్టం ఎవరిని ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఒక చిన్న సీన్, ఒక సాంగ్, ఒక లుక్ కూడా వారిని పాపులర్ చేయగలదు. అలా ఆసాకూడా అనే సాంగ్ తో ప్రీతీ ముకుందన్ ( Preity Mukundan) ఫేమస్ అయ్యింది. దానికి ముందే శ్రీవిష్ణు (Sreevishnu) సరసన ఓం భీమ్ బుష్ లో కనిపించినా ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆ సాంగ్ హిట్ అయ్యిందో అప్పటి నుంచి అమ్మడు స్టార్ గా మారిపోయింది. ఆ తరువాత మంచు విష్ణు సరసన కన్నప్పలో నటించింది.
కన్నప్ప సినిమాలో నెమలి పాత్రలో ప్రీతీ అందాల విందు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక కన్నప్ప తరువాత ప్రీతీకి మంచి అవకాశాలే వస్తాయి అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ భామ మంచి ఛాన్స్ పట్టేసింది. హిట్ ఫ్రాంచైజీతో హిట్స్ అందుకుంటున్న డైరెక్టర్ శైలేష్ కొలను.. కొద్దిగా రూటు మార్చి లవ్ స్టోరీ తెరకెక్కించే ప్లాన్ లో పడ్డాడు. టాలీవుడ్ హృతిక్ రోషన్ గా పేరు తెచ్చుకున్న రోషన్ మేక ఈ లవ్ స్టోరీలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఛాంపియన్ సినిమాతో రోషన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తండ్రి శ్రీకాంత్ లా రోషన్ ఫేస్ లవ్ స్టోరీలకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దీంతో ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో రోషన్ సరసన ప్రీతీ నటిస్తుందని సమాచారం. వీరిద్దరి పెయిర్ బావుంటుందని, కెమిస్ట్రీ కూడా కొంచెం ఎక్కువగానే ఉండబోతుందని టాక్. రోషన్ సరసన అంటే ప్రీతీ ఛాన్స్ పట్టేసినట్లే అని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి ఈ సినిమాతో ప్రీతీ లక్ మారుతుందేమో చూడాలి.