సెన్సార్ నే వణికించిన హర్రర్ చిత్రం 418.. అప్పుడే ఓటీటీకా
ABN, Publish Date - Nov 15 , 2026 | 06:57 PM
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మొదటిసారిగా హర్రర్ జోనర్లో తెరకెక్కింన చిత్రం 418. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సమర్పణలో కీర్తన నాగగౌడ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చైత్రా జె. ఆచార్, రమేష్ ఇందిర, సూర్య రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మొదటిసారిగా హర్రర్ జోనర్లో తెరకెక్కింన చిత్రం 418. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సమర్పణలో కీర్తన నాగగౌడ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చైత్రా జె. ఆచార్, రమేష్ ఇందిర, సూర్య రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సైన్స్, మూఢనమ్మకాల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత అక్టోబర్ 23 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భిన్నమైన టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి నుంచి ఈ సినిమా చూసి సెన్సార్ వాళ్లు కూడా భయపడినట్లు తెలపడంతో బాగా హైప్ వచ్చింది. అయినా కూడా ఈ చిత్రం ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ఈ హర్రర్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ అధికారికంగా డేట్‌ను లాక్ చేశారు. కనీసం నెల తిరక్కుండానే ఈ చిత్రం ఓటీటీ బాట పట్టింది. నవంబర్ 19 నుంచి తెలుగుతో పాటు అన్ని భాషల్లో 418 స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన హర్రర్ మూవీ లవర్స్ ఇక ఇంటి వద్దే ఓటీటీలో ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
కథా పరంగా చూస్తే.. కర్ణాటక తీర ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో వేదగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే మెడికల్ కాలేజీ ఉంటుంది. ఆ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ భవనం గతంలో ఒక మానసిక వైద్యశాలగా ఉండేది. ఆ భవనంలోకి మహిళలను అస్సలు అనుమతించరు. ఒకవేళ ఎవరైనా మహిళ అందులోకి అడుగుపెడితే ప్రాణాలతో బయటకు రారనే భయానక నియమం ఉంటుంది. వివేక్ శంకర్ (సూర్య రాజ్) అనే మెడికల్ విద్యార్థి ఆ హాస్టల్లోని రూమ్ నెంబర్ 417లో చేరతాడు. పక్కనే ఉన్న రూమ్ నెంబర్ 418 గత 15 ఏళ్లుగా తాళం వేసి ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని అతనికి కఠినమైన హెచ్చరికలు అందుతాయి. అయితే వివేక్ స్నేహితుడు రోహిత్ (చరణ్ లక్కరాజు) దెయ్యాలను, మూఢనమ్మకాలను నమ్మడు. మరోవైపు సైషా (ప్రీతి పగడాల) అనే అమ్మాయి ఆ రూమ్ నెంబర్ 418 రహస్యం తెలుసుకోవాలని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తరువాత ఏమైంది. అసలు రూమ్ నెంబర్ 418 మిస్టరీ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్ లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.