సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dragon: 'డ్రాగన్' ఇంటర్వెల్ బ్లాక్.. అంతకుమించి.. 

ABN, Publish Date - Jul 06 , 2026 | 03:31 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) , సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon). ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా, వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) , సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon). ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా, వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలబోసి వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే రేంజ్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల నుంచి లేచి నిలబడేలా చేస్తాయని సమాచారం. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, వారిని పూర్తిగా దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీల్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారట. ఈ ఇంటర్వెల్ ఫైట్‌లో తారక్ విద్వంసక నటన, సరికొత్త యాక్షన్ స్టంట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్. గతంలో ప్రశాంత్ నీల్ సినిమాల్లోని ఇంటర్వెల్ సీన్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌తో అంతకుమించిన భారీ యాక్షన్ విందును ఆయన సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్‌లో కథలోని అనేక కీలక పాత్రలను ప్రశాంత్ నీల్ పరిచయం చేసినప్పటికీ, అసలు కథకు మూలమైన మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ను మాత్రం రివీల్ చేయకుండా చాలా సస్పెన్స్‌గా ఉంచారు. అయితే, ఈ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ చుట్టూ తిరిగే కథాంశంలోనే హీరోయిన్ కృతి సనన్ క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన ట్రాక్‌లో ఆమె పాత్ర కనిపించబోతుండటంతో, సినిమాలో కృతి సనన్ పాత్ర ప్రాధాన్యతపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అందరికీ ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్స్, డార్క్ థీమ్స్ మాత్రమే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ ఎన్టీఆర్ 'డ్రాగన్' విషయంలో ఆయన తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట, పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి బ్లాక్ షేడ్ ఫ్రేమ్స్ అస్సలు కనిపించవని సమాచారం. మరి ప్రశాంత్ నీల్ ఈ ఫ్లాష్ బ్యాక్ కోసం అంత కలర్ ఫుల్ గా ఏం ప్లాన్ చేశారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని వచ్చే ఏడాది 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 03:31 PM