డ్రాగన్ వాయిదా.. సలార్ కి షిఫ్ట్ అయిన నీల్
ABN, Publish Date - Aug 12 , 2026 | 09:15 PM
కె.జి.యఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మాస్ కాంబినేషన్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు.
కె.జి.యఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), మాస్ కాంబినేషన్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ప్రస్తుతం నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న చిత్రం డ్రాగన్ (Dragon) . రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడంతో పాటు అంచనాలను భారీగా పెంచేశాయి. శరవేగంగా జరుగుతోన్న డ్రాగన్ షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఎన్టీఆర్ భుజానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స జరగడం, ఆయన పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించడంతో డ్రాగన్ కి ఒక మూడు నెలలు గ్యాప్ ఇచ్చారు. ఇక ఈలోపు నీల్.. ఎన్టీఆర్ లేకుండా మిగతా వారితో షూటింగ్ ఫినిష్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సంచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తన ప్రాధాన్యతలను మార్చుకోవాల్సి వచ్చిందని టాక్. ఎన్టీఆర్ గాయం వలన లభించిన 3 నెలల కాలాన్ని ఏమాత్రం వృథా చేయకుండా, ప్రశాంత్ నీల్ తన సెన్సేషనల్ ప్రాజెక్ట్ సలార్ 2 ప్రీ-ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడట.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా శౌర్యంగ పర్వం రానుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఆ తరువాత నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉండగా.. ప్రభాస్ మిగతా ప్రాజెక్ట్స్ తో బిజీగా మారాడు. ఇక ఇప్పటికీ నీల్ కి సలార్ 2 పై దృష్టి సారించడానికీ సమయం దొరికింది. ఇప్పటికే సలార్ చిత్రానికి సంబంధించి దాదాపు 20 శాతం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈ విరామాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నాడు.
ఈ 3 నెలల వ్యవధిలో హీరో, ఇతర నటుల అవసరం లేకుండానే పూర్తయ్యే స్క్రిప్ట్ వర్క్, సీన్ల ప్రీ-విజువలైజేషన్, కొత్త నటీనటుల ఎంపిక, భారీ యాక్షన్ ఎపిసోడ్లకు సంబంధించిన సెట్స్ రూపకల్పన వంటి కీలకమైన ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ నీల్ వేగవంతం చేయనున్నాడని టాక్. ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి డ్రాగన్ షూటింగ్‌లో పాల్గొనే వరకు లభించిన ఈ కాలాన్ని సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ వినియోగిస్తుండటంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నీల్ మావా ఇవన్నీ సెట్ చేసినా.. డార్లింగ్ ఎప్పుడు సెట్ లోకి అడుగుపెడతాడో చూడాలి.