ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ఇక సోషల్ మీడియా షేకే
ABN, Publish Date - Feb 10 , 2026 | 08:35 AM
RRR సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో తన సత్తా చాటిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ప్రస్తుతం తన కెరీర్‌ను ఒక సరికొత్త లెవల్‌కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో తన సత్తా చాటిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr), ప్రస్తుతం తన కెరీర్‌ను ఒక సరికొత్త లెవల్‌కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. దేవర చిత్రంతో సోలోగా 500 కోట్ల క్లబ్‌లో చేరి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారు తారక్. అయితే, రీసెంట్‌గా వచ్చిన వార్-2 విషయంలో మిక్స్‌డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ, ఆ డిజప్పాయింట్‌మెంట్‌ను పటాపంచలు చేస్తూ, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు వస్తున్నారు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel). వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.
ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌ను మార్చుకున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో మనం చూసిన డార్క్ షేడ్ బ్యాక్‌డ్రాప్‌ను పక్కన పెట్టి.. ఈసారి ఎన్టీఆర్ కోసం పూర్తి కలర్‌ఫుల్ స్క్రీనింగ్‌తో ప్రశాంత్ నీల్ మ్యాజిక్ చేయబోతున్నారు. తారక్‌ను కొత్త లుక్‌లో చూపిస్తూనే, నీల్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి ఏడాది కావస్తున్నా, ఇప్పటి వరకు టైటిల్ లేదా గ్లింప్స్ విషయంలో చిత్ర యూనిట్ సైలెంట్‌గా ఉండడం ఫ్యాన్స్‌ను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. మొదట ఈ సినిమాను జూన్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ షెడ్యూల్స్ కొంత డిలే అవ్వడం వల్ల.. అదే తేదీకి సినిమా రావడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. అయితే, ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు టీమ్ ఒక భారీ సర్ప్రైజ్‌ను ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఈసారి తారక్ పుట్టినరోజు ఒకే సర్ప్రైజ్ కాకుండా.. డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే అదే రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా గురించి కూడా ఒక బిగ్ అప్‌డేట్ రానుంది. అరవింద సమేత వంటి క్లాసిక్ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
డ్రాగన్ గ్లింప్స్.. గాడ్ ఆఫ్ వార్ అఫీషియల్ అప్‌డేట్.. ఈ రెండూ ఒకే రోజు రావడంతో సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా, వార్-2తో వచ్చిన చిన్న గ్యాప్‌ను పూడ్చేందుకు తారక్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ విజువల్ వండర్, త్రివిక్రమ్ డైలాగ్ పవర్.. ఈ రెండు ప్రాజెక్టులతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి సునామీ సృష్టించడం పక్కా.