ప్రశాంత్ నీల్.. మూవీకి లైన్ క్లియర్
ABN, Publish Date - Sep 10 , 2026 | 05:42 PM
ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హర్రర్ చిత్రం 418 ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ '418'. కీర్తన్ నందగౌడ (Kirtan Nadagouda) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య రాజ్ (Surya Raj), చరణ్ లక్కరాజు (Charan Lakkaraju), ప్రీతీ పగడాల (Preethi Pagadala) కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. సినిమాలో హర్రర్ సన్నివేశాల విషయంలో సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరాలు పెట్టడంతో మేకర్స్ మూవీ, ట్రైలర్, రిలీజ్ అన్నింటినీ వాయిదా వేసుకోక తప్పలేదు.
అయితే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చి ప్రేక్షకులను హెచ్చరించింది. అలానే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాతో ఒక నెవర్ బిఫోర్ హారర్ థ్రిల్లర్ ని నీల్, మైత్రి సంస్థ తీసుకువస్తున్నట్లుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి '418' ఏ మేరకు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందో చూడాలి!