సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pranay Reddy: రివ్యూలతో సినిమా స్థాయి తగ్గదు.. ‘స్పిరిట్‌’పై ప్రణయ్‌ రెడ్డి ధీమా

ABN, Publish Date - Sep 12 , 2026 | 04:00 PM

''నిర్మాణ రంగంలో ఉన్నవారికే సినిమా చేయడం వెనుక ఉన్న కష్టాలు పూర్తిగా తెలుస్తాయి. రివ్యూలతో సినిమా స్థాయిని తగ్గించలేరు. అంత దమ్ము ఉంటే రాబోయే ‘స్పిరిట్‌’ స్థాయిని తగ్గించగలరా?’’ అంటూ ప్రణయ్‌ రెడ్డి ప్రశ్నించారు.

''నిర్మాణ రంగంలో ఉన్నవారికే సినిమా చేయడం వెనుక ఉన్న కష్టాలు పూర్తిగా తెలుస్తాయి. రివ్యూలతో సినిమా స్థాయిని తగ్గించలేరు. అంత దమ్ము ఉంటే రాబోయే ‘స్పిరిట్‌’ స్థాయిని తగ్గించగలరా?’’ అంటూ ప్రణయ్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆయన నిర్మించిన  ‘రోమాంచకం’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ స్పందనతోపాటు కొన్ని రివ్యూల్లో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం వెనుక ఉండే కష్టాల గురించి ప్రణయ్‌ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒక సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత సులభమైన విషయం కాదని ఆయన అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నిర్మాణ రంగంలో ఉన్నవారికే సినిమా చేయడం వెనుక ఉన్న కష్టాలు పూర్తిగా తెలుస్తాయి. ఒక రచయిత కథ రాయడం నుంచి దర్శకుడు దాన్ని తెరపైకి తీసుకురావడం వరకు ఎన్నో దశలు ఉంటాయి. షూటింగ్‌ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. ‘రోమాంచకం’ విషయంలో కొందరు రివ్యూల పేరుతో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వ్యవహరించారు. అంత దమ్ము ఉంటే  రాబోయే ‘స్పిరిట్‌’ స్థాయిని తగ్గించగలరా?’’ అంటూ సవాల్ విసిరారు. 

ప్రణయ్‌ రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి దృష్టి ‘స్పిరిట్‌’పై పడింది. ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌, సందీప్‌ రెడ్డి వంగా లాంటి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Sep 12 , 2026 | 05:07 PM