ప్రకాష్ రాజ్ ని ఎందుకు తీసుకున్నావ్.. వారణాసి నుంచి తప్పించు
ABN, Publish Date - Nov 11 , 2026 | 05:18 PM
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాష ఏదైనా ఆయన నటనతో ఆ పాత్రకు ప్రయాణం పోయడం ప్రకాష్ రాజ్ కి ఉన్న అలవాటు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాష ఏదైనా ఆయన నటనతో ఆ పాత్రకు ప్రయాణం పోయడం ప్రకాష్ రాజ్ కి ఉన్న అలవాటు. నటుడిగా ఆయనకు ఎంత మంచి పేరు ఉందో..రాజకీయాల్లో అంతే చెడ్డ పేరు ఉంది. తన రాజకీయ అభిప్రాయాలు, బహిరంగ వ్యాఖ్యలతో తరచుగా వివాదాల్లో నిలబడే ప్రకాష్ రాజ్ ని ఎప్పటినుంచో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ బ్యాన్ కొనసాగింది కూడా. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి (Varanasi) చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నెటిజన్స్, ప్రకాష్ రాజ్ ని వారణాసి నుంచి బహిష్కరించు రాజమౌళి..ఆయనను ఎందుకు తీసుకున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ప్రకాష్ రాజ్.. ఈ నెగిటివిటీపై, తనను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై స్పందించాడు. ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ' నేను కేజీఎఫ్ లో నటించినప్పుడు కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు, కానీ ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే నన్ను బ్యాన్ చేయాలని ప్రచారం చేసినా దృశ్యం 3 అంతకంటే ఎక్కువ వసూళ్లను సాధించింది. నటుడిగా నా పనిని చూసి ఇష్టపడే ప్రేక్షకులకు నా వ్యక్తిగత అభిప్రాయాలతో ఎలాంటి సమస్య లేదు. తెలుగు చిత్రసీమలోనాపై ఎనిమిది సార్లు నిషేధం విధించారు. ఐదు భాషల్లో ప్రాజెక్టులు చేస్తూ ప్రయాణాలు చేయడం వల్ల సమయ వేళల సర్దుబాటులో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంతేతప్ప నేను ఎలాంటి తప్పు లేదా చట్టవిరుద్ధమైన నేరాలు చేయలేదని' చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబోలో వస్తోన్న స్పిరిట్ లో కూడా ఆయన నటించాల్సి ఉంది. ఈ సినిమా నుంచి రిలీజైన ఆడియోలో కూడా ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా ఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని సమాచారం. డానికి కారణాలు చాలా ఉన్నాయని టాక్. ఏదిఏమైనా ఈ విలక్షణ నటుడు తన నటనతో ప్రేక్షకులను మెప్పించేవరకు తనను ఎవరూ బ్యాన్ చేయలేరని చెప్పుకొచ్చాడు. మరి వారణాసిలో ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో.. రిలీజ్ అయ్యాక ఆయన పాత్ర ఎలాంటి వివాదాలను తీసుకొచ్చిపెడుతుందో చూడాలి.