Spirit: ప్రకాశ్‌ రాజ్ ఉన్నట్టా... లేనట్టా!? కారణం ఏమిటీ!?

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:49 PM

'స్పిరిట్‌' మూవీ నుంచి ప్రకాశ్‌ రాజ్ వైదొలగినట్టు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడానికి అంగీకరించకపోవడంతో ప్రకాశ్‌ రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

Prakash Raj

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'స్పిరిట్' రెగ్యులర్ షూటింగ్‌ గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ మొదలు కావడానికి ముందే దీపికా పదుకొనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. పని గంటల విషయంలో ఆమె నియమించిన నిబంధనలే అందుకు కారణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీపికా పదుకొనే ఈ సినిమా లాభాల్లో వాటా అడిగారని, అందుకే ఆమెను సినిమా నుంచి తప్పించారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా, ఆమె స్థానంలో తృప్తి డిమ్రీని హీరోయిన్‌గా సందీప్ రెడ్డి వంగా తీసుకున్నారు.


ఆ మధ్య ప్రకాశ్ రాజ్ కూడా 'స్పిరిట్‌' మూవీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రకాశ్‌ రాజ్ దాన్ని ఖండించారు. తాను 'స్పిరిట్‌'లో నటిస్తున్నానని, పనీపాటలేని వారు ఇలా పుకార్లు పుట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజానికి 'స్పిరిట్‌' మూవీ ఫస్ట్ వాయిస్ ప్రోమో వచ్చినప్పుడు అది ప్రకాశ్‌ రాజ్ వాయిస్ తోనే వచ్చింది. ఇందులో ఆయనది ఎంత ప్రధానమైన పాత్రో అందరికీ తెలిసింది. కాబట్టి సందీప్ రెడ్డి వంగా ప్రకాశ్‌ రాజ్ ను 'స్పిరిట్' నుంచి తొలగించకపోవచ్చుననే చాలా మంది అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో తాజాగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే... ప్రకాశ్‌ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టే అనిపిస్తోంది. దీనికి కారణం కూడా చిత్రంగా ఉంది. ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీని, ప్రధాని మోదీని, సనాతన ధర్మాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్‌ రాజ్ విమర్శిస్తున్నారు. దాంతో ఆయనపై నెగెటివిటీ అనేది క్రమంగా సినిమా రంగంలోనూ పెరుగుతోంది. ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండాలని, 'స్పిరిట్‌' మూవీ విడుదలయ్యే వరకూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ, ఇంటర్యూలు ఇవ్వడం కానీ చేయొద్దని 'స్పిరిట్‌' మేకర్స్ ప్రకాశ్‌ రాజ్ ను కోరారట. దానికి ఆయన అంగీకరించలేదని, తన వ్యక్తిగత అభిప్రాయ వ్యక్తీకరణకు, సినిమాకు ముడిపెట్టవద్దని చెప్పాడని, దాంతో అతన్ని సినిమా నుంచి తప్పించారని అంటున్నారు.

సహజంగా సినిమాలోని కీలక పాత్రధారులు ఇలా మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసినా, వారి సెంటిమెంట్స్ ను దెబ్బకొట్టే పనులకు పాల్పడినా, అది సినిమా ఫలితం మీద ప్రభావం చూపించే ఆస్కారం లేకపోలేదు. సో... 'స్పిరిట్' మేకర్స్ అందుకే ప్రకాశ్ రాజ్ కు ఈ నిబంధన విధించి ఉండొచ్చు. ఇదే నిజమైతే... ప్రకాశ్‌ రాజ్ మౌనంగా మాత్రం ఉండరు. 'స్పిరిట్‌' మేకర్స్ మీద తన స్థాయిలో వ్యంగ్యాస్త్రాలను ప్రయోగిస్తారు. చూద్దాం... ఏం చేస్తారో!?

ఇవి కూడా చదవండి:

రవితేజ 'ఇరుముడి' రివ్యూ

‘ఇరుముడి’ దర్శకుడు శివ నిర్వాణతో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

సమాజం తిరస్కరించిన వారి జీవితాలపై సినిమా.. టైటిల్ ఇదే

Updated Date - Aug 21 , 2026 | 01:55 PM