ప్రకాష్ రాజ్‌కు.. అవకాశాలు ఇవ్వ కూడదు

ABN , Publish Date - May 06 , 2026 | 09:43 AM

శ్రీరామ లక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

prakash raj controversy

శ్రీరామ లక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు ప్రకాష్ రాజ్ (prakash raj యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని మంగళవారం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు బీజేపీ నేతలు వినతిపత్రాలు అందజేశారు.

prakash raj controversy

ఈ సందర్భంగా వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎఎన్నార్ లాంటి గొప్పనటులు ఉన్న ఈ పరిశ్రమలో ప్రకాష్ రాజ్ లాంటి వాడు ఉండకూడదని, హిందూ సమాజానికి ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలి లేదంటే అతనికి అవకాశాలు ఇవ్వకూడదని కోరారు. ఈ వ్యవహారాన్ని చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల ముందుకు తీసుకువెళతామని తెలిపారు. కార్యక్రమంలో సినీ నటుడు పసునూరి శ్రీనివాసులు, మాజీ కార్పోరేట‌ర్‌ కొప్పుల నర్సింహారెడ్డి, బీజేపీ నేతలు బోల్లం యశ్వాల్ గౌడ్, ప్రభాకరయాదవ్, నరేష్ యాదవ్, విజయశ్రీ చౌదరి, బత్తుల సుమన్ గౌడ్ పాల్గొన్నారు.

prakash raj controversy

Updated Date - May 06 , 2026 | 09:57 AM