ప్రకాష్ రాజ్: ‘వారణాసి’లో పాత్రపై క్లారిటీ.. వీడియో వైరల్..
ABN, Publish Date - Feb 17 , 2026 | 09:39 AM
మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘వారణాసి’. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు కూడా ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నారు.
మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘వారణాసి’ (Varanasi). శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రధారి. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు (Prakash Raj) కూడా ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నారు. అయితే ఇప్పటి దాకా రాజమౌళి నుంచి ప్రకాశ్ పాత్ర విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. మహేశ్‌కు తండ్రిగా కనిపిస్తారని, నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రకాశ్‌రాజ్ ‘వారణాసి’లో చేయనున్న పాత్ర గురించి స్పష్టతనిచ్చారు. ఇందులో తాను మహా శివుని భక్తుడిగా నటిస్తున్నట్లు వెల్లడించారు. నటుడిగా తన ఆకలి తీర్చే పాత్ర ఇదని ఆయన తెలిపారు.
తాజాగా ఓ యూత్ సెషన్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హిందీ ‘దృశ్యం 3’లోనూ ఓ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియోలో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో మహేశ్, ప్రియాంక చోప్రా, మిగతా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని, తదుపరి పలు యాక్షన్ సీన్స్ షూట్ చేయయబోతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.