సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మంచు విష్ణు.. గట్టి డైరెక్టర్ నే పట్టాడుగా

ABN, Publish Date - Nov 23 , 2026 | 07:20 PM

మంచు హీరో విష్ణు మంచు (Vishnu Manchu) కన్నప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత విష్ణు స్క్రిప్ట్స్ ని ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

VM24

మంచు హీరో విష్ణు మంచు (Vishnu Manchu) కన్నప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత విష్ణు స్క్రిప్ట్స్ ని ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఒక మంచి డైరెక్టర్ ని లైన్లో పెట్టాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా (Prabhudeva). నేడు మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా విష్ణు మంచుకు బర్త్‌డే విషెస్ తెలుపుతూనే, తమ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ VM 24ను అధికారికంగా ప్రకటించాడు. విష్ణు మంచును మై హీరో, మై బ్రదర్ అని ఆప్యాయంగా సంబోధించిన ప్రభుదేవా.. వారి కాంబోలో రాబోతున్న సినిమా చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు.


ప్రభుదేవా చెప్పిన కథ విష్ణుకు ఎంతగానో నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించేలా, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. తన పాత్రకు తగ్గట్టుగా విష్ణు మంచు ప్రత్యేకంగా శరీరాకృతిని మార్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


ప్రభుదేవాకి దర్శకత్వం కొత్తేమీ కాదు. తెలుగు, హిందీ భాషల్లో ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మంచి హిట్ ని అందుకున్నాయి. దీంతో ప్రభుదేవా- మంచు విష్ణు కాంబోపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈసారి విష్ణు గట్టి డైరెక్టర్ నే పట్టాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన తారాగణం, సాంకేతిక బృందం, అధికారిక ప్రకటనతో సహా మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 23 , 2026 | 07:26 PM