సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Spirit: ‘స్పిరిట్‌’ పరుగులే.. సందీప్‌ వంగా స్పీడ్‌కు ఫ్యాన్స్ హ్యాపీ!

ABN, Publish Date - Jul 05 , 2026 | 01:17 PM

సందీప్‌రెడ్డి వంగా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగిపోతోంది. ఆయన తీసింది కేవలం మూడు సినిమాలే అయినా.. క్రియేట్ చేసిన సెన్సేషన్ మాత్రం మామూలుది కాదు.

Spirit Update

సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగిపోతోంది. ఆయన తీసింది కేవలం మూడు సినిమాలే అయినా.. క్రియేట్ చేసిన సెన్సేషన్ మాత్రం మామూలుది కాదు. కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవం ఏమిటంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా, తను అనుకున్నది సూటిగా, బోల్డ్‌గా చెప్పే దమ్మున్న ఏకైక దర్శకుడు తను. ఇక ఆయన సినిమాల మేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌కి దూరంగా, వీలైనంత న్యాచురల్‌గా, రా అండ్ రస్టిక్‌గా సీన్స్ డిజైన్ చేయడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సందీప్ వంగా జెట్ స్పీడ్‌లో పరుగులు పెట్టిస్తున్నాడు.


నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఒక చిన్న టెన్షన్ ఉంది. ఒకవైపు డైరెక్టర్ హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్న ప్రభాస్.. అదే సమయంలో ‘స్పిరిట్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఇలా రెండు భారీ ప్రాజెక్ట్స్ ప్యారలల్‌గా జరుగుతుండటంతో.. అనుకున్న టైంకి ‘స్పిరిట్’ రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు రావడం సహజం. కానీ, ఇక్కడే సందీప్ రెడ్డి వంగా తన మార్క్ పక్కా ప్లానింగ్ చూపిస్తున్నాడు. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి 60 నుంచి 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ వినిపిస్తోంది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు.. వాటితో పాటు ప్రమోషన్స్‌కు భారీగా టైం కేటాయించాలనేది డైరెక్టర్ మాస్టర్ ప్లాన్. ఎందుకంటే, ప్రభాస్ గ్లోబల్ ఇమేజ్‌కి తగ్గట్లుగా వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ చేయాలి కాబట్టి, ఆ ప్లానింగ్ ముందే పక్కాగా చేసుకున్నారు. ఇక వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన స్పిరిట్ బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయం. రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు.


ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ మునుపెన్నడూ చూడని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్‌లో ప్రభాస్ విశ్వరూపం ఎలా ఉండబోతోందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అంచనాలను అమాంతం పెంచేసింది. ఒక్క పోస్టర్‌తోనే ఆడియెన్స్ అటెన్షన్ మొత్తం ‘స్పిరిట్’ వైపు లాగేశాడు సందీప్ వంగా. కాస్టింగ్ విషయానికి వస్తే.. ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ‘యానిమల్’ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ‘యానిమల్’ సినిమాతో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్రేజీ సాంగ్స్ అందిస్తున్నాడు. టి-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. మొత్తానికి డార్లింగ్ ఫ్యాన్స్‌కి మాత్రం వచ్చే ఏడాది మార్చిలో మామూలు పండగ ఉండదనేది మాత్రం అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి:

ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. ఎప్పుడంటే

సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!

ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!

Updated Date - Jul 05 , 2026 | 01:17 PM