Spirit: 'స్పిరిట్' రిలీజ్ డేట్ ఫిక్స్ ..ఇక రచ్చ రచ్చే
ABN, Publish Date - Oct 18 , 2026 | 12:30 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) విడుదల తేదీ ఖరారైంది. గతంలో ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు డేట్ మారింది. వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 29న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీని వెల్లడిస్తూ సినిమా బృందం అప్డేట్ ఇచ్చింది.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన మేకింగ్ స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. తొలిసారి ప్రభాస్తో కలిసి పనిచేస్తుండటంతో ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ను మునుపెన్నడూ చూడని రీతిలో సందీప్ రెడ్డి వంగా తెరపై ఆవిష్కరించనున్నారనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. దీపావళి బరిలోకి దిగనున్న ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.