సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స‌లార్‌, డ్రాగ‌న్ క్రాసోవర్! నీల్ మామ‌.. అస‌లేం ఫ్లాన్ చేస్తున్నావ్‌! ఫ్యాన్స్, థియేట‌ర్లు ఉండాలా.. పోవాలా

ABN, Publish Date - Apr 29 , 2026 | 06:34 AM

యంగ్ టైగర్ యన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తోన్న సినిమాపై ఓ విషయం భలేగా హల్ చల్ చేస్తోంది.. అదే జరిగితే ప్రశాంత్ తనకంటూ ఓ యూనివర్స్ క్రియేట్ చేసుకున్నట్టే అంటున్నారు.. అసలు కథేంటో...!?

salaar

ఈ మధ్యే యన్టీఆర్ (NTR)- ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డ్రాగ‌న్ (Dragon) మూవీకి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. వాటిని ఎవరైనా లీక్ చేశారా? లేక మేకర్స్ కావాలనే ఈ ఫొటోలను వదిలారా? అనీ చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే - ఆ పిక్స్ ను చూసిన తరువాత చాలామందికి ఇంతకు ముందు ప్ర‌భాస్‌తో ప్రశాంత్ నీల్ తీసిన 'సలార్ (Salaar: Part 1 – Ceasefire) సినిమా గుర్తుకు వస్తోంది.

'సలార్'లో పలు గ్రూపులు కలసి ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యే సీన్ను ఆ పిక్స్ గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. అదీగాక లోగడ 'సలార్'లో వరదరాజ మన్నార్‌గా నటించిన పృథ్వీరాజ్ చేసిన కామెంట్‌నూ గుర్తు చేసుకుంటున్నారు సినీ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తయారు చేసుకున్న కథలు తనకు తెలుసునని పృథ్వీరాజ్ అప్పట్లో చెప్పారు. అందులో తన శివమన్నార్ పాత్ర ప్రశాంత్ నీల్ మరో సినిమాలో క్రాసోవర్ అవుతుందనీ అన్నారు పృథ్వీరాజ్. అదే ఇప్పుడు యన్టీఆర్ - నీల్ మూవీలో క్రాస్ అవుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.

నీల్ యూనివర్స్..

ఎంతో మంది క్రియేటివ్ డైరెక్టర్స్ తమ పాత చిత్రాల్లోని పాత్రలను తాము తీసే కొత్త సినిమాల్లోనూ ప్రవేశ పెడుతూ ఉంటారు. ఇలా 'క్రాసోవర్' మూవీస్ క్రియేట్ చేసి జనాన్ని అలరిస్తూంటారు. రామ్ గోపాల్ వర్మ తన 'శివ'లోని యాదగిరి పాత్రను తరువాత 'గాయం' వంటి చిత్రంలోనూ చొప్పించారు. ఇక ఈ మధ్య లోకేశ్ కనగరాజ్ సైతం తన సినిమాల్లోని పాత్రలను కొత్త చిత్రాల్లోనూ ప్రవేశ పెట్టి తనకంటూ ఓ యూనివర్స్ క్రియేట్ చేసుకున్నారు. అదే తీరున ప్రశాంత్ నీల్ కూడా 'సలార్'లోని కొన్ని పాత్రలతో యన్టీఆర్ సినిమాలో సందడి చేయనున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇంకెన్ని కనిపిస్తాయో..!?

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో 'క్రాస్ ఓవర్ మూవీస్'తో మురిపించారు. అయితే యంగ్ టైగర్ తో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో 'సలార్' పాత్రలు కొన్ని కనిపిస్తాయని తెలియగానే అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు. మరి ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసుకుంటున్న యూనివర్స్ లో ఇంకా ఎన్ని పాత్రలు అటు ఇటుగా సాగుతాయో చూడాలి. ఒక‌వేళ ఈ వార్త‌లు వాస్త‌వ రూపం దాల్చితే మాత్రం ఇరువురి ఫ్యాన్స్ ఆనందానికి ఆపై థియేట‌ర్లలో క‌లెక్ష‌న్ల విద్వంసం ఖాయం అవ‌డం ప‌క్కా అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు..

Updated Date - Apr 29 , 2026 | 07:20 AM