Prabhas: ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’.. ఈ ట్యాగ్‌పై ప్రభాస్ ఏమన్నారంటే!
ABN, Publish Date - Aug 22 , 2026 | 05:04 PM
ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు.
ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో మరింత బలపడింది. దేశవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు మరో కొత్త బిరుదు దక్కింది. అదే ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ (Indias Biggest superstar). సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ ప్రమోషనల్ కంటెంట్‌లో ఈ ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో ఈ బిరుదుపై చర్చ మొదలైంది. కొందరు అభిమానులు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ ట్యాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శలతో చిత్రబృందం వెనక్కి తగ్గలేదు. తదుపరి విడుదల చేసిన పోస్టర్లలోనూ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను కొనసాగించింది. దీంతో అసలు ఈ బిరుదును ప్రభాస్ ఎలా తీసుకున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజాగా ఈ విషయంపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడైన ప్రణయ్.. ‘రొమాంచకం’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ప్రభాస్ రియాక్షన్‌ను బయటపెట్టారు. “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్” అనే ట్యాగ్ గురించి ప్రభాస్‌కు చెప్పినప్పుడు.. ‘మీ ఇష్టం డార్లింగ్’ అని ఆయన అన్నారు అని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు ఇచ్చిన బిరుదుపై ప్రభాస్ ఎలాంటి హైప్ లేకుండా చాలా కూల్‌గా స్పందించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తనను తాను స్టార్‌గా చెప్పుకోవడం కంటే.. తన సినిమాలే తన స్థాయిని నిర్ణయిస్తాయన్నట్లుగా ప్రభాస్ రియాక్షన్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను సినిమా టైటిల్ క్రెడిట్స్‌లోనూ ఉపయోగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.