Bahubali 3: ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు..
ABN, Publish Date - Jun 26 , 2026 | 01:57 PM
ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు.. ‘బాహుబలి 3’ ఉంటుందా ? లేదా ఎంతోకాలంగా ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. పరోక్షంగా ఇప్పటికే చిత్ర బృందం హింట్స్ ఇస్తూ వచ్చింది.
‘బాహుబలి 3’ ఉంటుందా ? లేదా ఎంతోకాలంగా ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. పరోక్షంగా ఇప్పటికే చిత్ర బృందం హింట్స్ ఇస్తూ వచ్చింది. అయినా జనాలకు ఎగ్జైట్‌మెంట్ ఆగట్లేదు. ఎప్పుడెప్పుడా అని ఆరాలు తీస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ కన్నా ముందూ సదరు ఓటీటీ సంస్థ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ ‘బాహుబలి 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు.. మీ అందరికోసం బాహుబలి మూడో పార్టు రానుంది’ అని ప్రభాస్, రానా, అనుష్క తెలిపారు. అంతే కాదు ఈ చిత్రం తనకు ఓ ఎమోషనల్ జర్నీ అని ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు.
ప్రభాస్ అనుష్కకు సంబంధించిన ఓ ఫన్నీ విషయాన్ని షేర్ చేశారు. ‘స్వీటీ నవ్వడం మొదలుపెడితే ఆగకుండా 40 నిమిషాలు నవ్వుతుందని తెలిపారు. ఈరోజు నవ్వకూడదు అనుకుంటూ ప్రతి రోజూ సెట్‌కు వచ్చేదని, నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకునేదని చెప్పారు.