సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ప్రభాస్ ఫోటో.. ఇలా ఉన్నాడేంటి
ABN, Publish Date - Aug 12 , 2026 | 06:02 PM
పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ చిత్రంపైనే ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి సారించాడు.
పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ చిత్రంపైనే ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి సారించాడు. ఒకవైపు రీహార్సల్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తూనే.. మరోవైపు తన రాబోయే భారీ ప్రాజెక్ట్‌లు స్పిరిట్, కల్కి 2 చిత్రాల వర్క్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. సాధారణంగా ప్రభాస్ ఎక్కువ సోషల్ మీడియాలో కనిపించడు. కానీ, ఒకసారి కనిపిస్తే మాత్రం ట్రెండింగ్ నెంబర్ 1 గా ఉంటాడు. తాజాగా ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రభాస్ లుక్స్ పై ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోన్న విషయం తెల్సిందే. ఒకప్పుడు డార్లింగ్ ఫేస్ లో ఉన్న ఛార్మ్, గ్లో ఇప్పుడు లేదు. మరి ముఖ్యంగా ప్రభాస్ బరువు పెరిగి.. బుగ్గలు వచ్చి, వయస్సు పెరిగినట్లు కనిపించిన ఫోటోలు చాలా ఉన్నాయి. తాజాగా ఈ ఫోటోలో డార్లింగ్ కాస్త అలసిపోయినట్లు, లీన్‌గా కనిపిస్తున్నాడు. బ్లాక్ కుర్తా.. వైట్ ప్యాంట్.. గాగుల్స్ తో ఉన్న ప్రభాస్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చాలామంది అసలు ప్రభాస్ ని గుర్తుపట్టడం లేదు. ఏంటి.. ప్రభాస్ నా ఇలా మారిపోయాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోటో ఇప్పటిది కాదని తెలుస్తోంది. ప్రభాస్ వెనుక మిర్చి టీమ్ ఉండడంతో.. వారిని ఎడిట్ లో తీసేసి డార్లింగ్ న్యూ లుక్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో డార్లింగ్ కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడంతో ఆయన అంతా నీరసంగా ఉన్నాడని అంటున్నారు. మరికొందరు లేదు లేదు ఇది రీసెంట్ ఫోటోనే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఒక కఠినమైన డైట్, రోబోస్ట్ ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను ప్రారంభించాడని, అందుకే ఇలా ఉన్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.