సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కటౌట్‌ కాదు డ్యూడ్‌.. క్యారక్టర్‌ చూసి ఫిదా అవ్వాల్సిందే..!

ABN, Publish Date - Apr 01 , 2026 | 03:49 PM

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టే మొనగాడు ఆయన.. ఇంటర్నేషనల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ ఆయన..

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టే మొనగాడు ఆయన.. ఇంటర్నేషనల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ ఆయన.. కానీ, ఇవేవీ తన తలకెక్కించుకోకుండా, నేల మీద నడుస్తూ అందరినీ డార్లింగ్ అని పిలిచే ఒకే ఒక్కడు. మన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).

ప్రభాస్ అంటే కేవలం కటౌట్ మాత్రమే కాదు.. అంతకు మించిన గొప్ప గుణం. ఒక్కసారి తను ఒక మనిషిని నమ్మాడంటే, ఆ మనిషి చేయి ఎప్పటికీ వదలడు. ఇది మన తెలుగు వాళ్లందరికీ తెలిసిన విషయమే అయినా.. ఇప్పుడు మరోసారి ఇద్దరు యంగ్ హీరోల విషయంలో అది అక్షరాలా నిజమని నిరూపిస్తున్నారు ప్రభాస్.

ప్రభాస్ కెరీర్‌లో ఒక మైలురాయి వర్షం సినిమా. ఆ చిత్రంతో ప్రభాస్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు శోభన్. దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన కుటుంబాన్ని ప్రభాస్ ఎప్పుడూ తన సొంత కుటుంబంలాగే చూసుకుంటున్నారు. శోభన్ కుమారులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్‌లను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి ప్రభాస్ బ్యాక్ బోన్‌గా నిలుస్తున్నారు. ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్‌ లో సంతోష్ శోభన్ వరుసగా సినిమాలు చేస్తుండడం వెనుక డార్లింగ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. కేవలం ఛాన్సులు ఇవ్వడమే కాదు, బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సరే, వారి సినిమాల కోసం స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తూ ప్రమోషన్స్‌లో తోడుగా నిలుస్తున్నారు. రీసెంట్‌గా కపుల్‌ ఫ్రెండ్లీ టీమ్‌తో చేసిన చిట్ చాట్ ఎంత వైరల్ అయిందో చూశాం.

ఇక ప్రభాస్‌కు మరో స్నేహితుడు శర్వానంద్. వీరిద్దరి బాండింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గతంలో శర్వానంద్ నటించిన రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సినిమాలకు ప్రభాస్ అందించిన సపోర్ట్ మరువలేనిది. ఇప్పుడు శర్వానంద్ నటిస్తున్న బైకర్ సినిమా కోసం ప్రభాస్ మరోసారి తన స్నేహాన్ని చాటుకున్నారు. మిర్చి సినిమాలో ప్రభాస్ బైక్ మీద వచ్చే సీన్ ఒక సెన్సేషన్. ఇప్పుడు అదే సీన్‌ను బైకర్ టీమ్ కోసం రీ-క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ - శర్వానంద్ కాంబినేషన్ అంటేనే హ్యాట్రిక్ హిట్ లకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు బైకర్ సినిమాతో ఆ సక్సెస్ గ్రాఫ్ మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. ప్రభాస్ చేసే సాయం కేవలం ఆర్థికంగానే ఉండదు.. అది మానసికమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఒక స్టార్ హీరో తన కోసం నిలబడ్డాడు అన్న నమ్మకం ఆ యంగ్ హీరోల కెరీర్‌కు బూస్టప్‌ను ఇస్తోంది. ప్రభాస్ తన ఫ్రెండ్స్ కోసమే కాదు, తన దగ్గర పనిచేసే స్టాఫ్ విషయంలో కూడా అంతే ప్రేమగా ఉంటారు. అందుకే ఇండస్ట్రీలో ప్రభాస్‌ను వ్యతిరేకించే మనిషి ఒక్కడు కూడా కనిపించడు. సినిమాల పరంగా ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా, తన పాత పరిచయాలను, తనను నమ్మిన వ్యక్తులను గుండెల్లో పెట్టుకుంటాడు. కటౌట్ చూసి కాకపోయినా.. ఆయన క్యారెక్టర్ చూసి కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే.

Updated Date - Apr 01 , 2026 | 04:46 PM